Monsoon Diet: Which Vegetables should be
eaten during the rainy season
వానాకాలంలో ఈ కూరగాయలు తినాలి
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి
చెందుతుంది కనుక వానాకాలంలో తీసుకునే కూరగాయలు, ఆహారం పట్ల తగిన
జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కొన్ని హెల్త్ టిప్స్ పాటిస్తే సీజనల్ వ్యాధుల
బారిన పడకుండా ఉంటారు.
ముఖ్యాంశాలు
కాలం మారగానే కొన్ని సీజనల్
సమస్యలు,
ఇన్ఫెక్షన్లు బాధిస్తుంటాయి.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉండటంతో
జాగ్రత్తలు తప్పనిసరి.
ఈ కూరగాయల్ని వానాకాలంలో తిని
ఆరోగ్యం కాపాడుకోండి.
1. కాకరకాయ
కాకరకాయ తింటే మీ శరీరానికి
కావాల్సిన మెగ్నీషియం, ఐరన్, పొటాషియం,
కాల్షియం లాంటి పోషకాలతో పాటు విటమిన్ సి లభిస్తుంది. చేదు ఉందని
ఎక్కువ మంది తినరు. కానీ ఆ చేదు వైరల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. ఎముకల
బలాన్ని పెంచడంతో పాటు సీజనల్ జబ్బుల బారిన పడకుండా చేస్తుంది. కాకరకాయలో బీటా
కెరోటిన్, ఫైబర్ లభిస్తాయి.
2. బెండకాయ
బెండకాయను చాలా మంది ఇష్టంగా
తింటారు. ఇందులో పీచు పదార్ధాలతో పాటు పోషకాలు లభిస్తాయి. లేత బెండకాయ తింటే శరీరం
రిఫ్రెష్ అవుతున్న భావన కలుగుతుంది.
3. సోరకాయ
కరోనా వ్యాప్తి సమయం కనుక సోరకాయ
తినడం ఉత్తమం. యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా
అందుతాయి. బరువు తగ్గాలనుకునేవారు సొరకాయను తింటారు. కరోనా టైమ్‌లో ఇంట్లోనే
కూర్చుని బరువు పెరిగేవారు ఈ కూర తరచుగా తినాలి.
4. దుంపలు
వానాకాలంలో దుంపల్ని తినడం ఉత్తమం.
భూమి లోని సారాన్ని అధికంగా తీసుకుంటూ పెరిగేవి దుంపలు. బంగాళాదుంపతో కూర, లేక
ఫ్రై చేసుకుని తింటే మంచిది. ఎర్రగడ్డ (మొరంగడ్డ) లాంటి దుంపలు కాల్చుకుని లేక
ఉడికించి తింటే పోషకాలు లభిస్తాయి. అయితే మోతాదుకు మించి తినవద్దు.
5. దోసకాయ
వేసవికాలంతో పాటు వర్షాకాలంలోనూ
తినాల్సింది దోసకాయ. ఇది తింటే శరీరంలో విషపూరిత పదార్థాలను, వ్యర్థాలను
తొలగిస్తుంది. శరీరం ఉత్తేజితమైనట్లు అనిపించి వానాకాలం బద్దకం పోయి మీరు పనులు
చురుకుగా చేస్తారు.
0 Komentar