Work from Home Continues Forever - Population Challenges India
- Microsoft Chief Bill Gates
వర్క్ ఫ్రమ్ హోం ఎప్పటికీ కొనసాగుతుంది
- జనాభాయే భారతకు సవాల్
- మైక్రోసాఫ్ట్
అధినేత బిల్ గేట్స్
ఇంటి నుంచి విధులు నిర్వర్తించే
(వర్క్ ఫ్రం హోమ్) సంస్కృతి బాగా పనిచేసిందని మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్
అన్నారు. కరోనా మహమ్మారి తొలగిపోయినా చాలా కంపెనీలు ఈ విధానాన్ని కొనసాగిస్తాయని
తెలిపారు. 'కోవిడ్-19 నేపథ్యంలో
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. దీంతో కంపెనీలు
తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం -హోమ్ కు మార్చివేశాయి. మహమ్మారి ముగిసిన తర్వాత
కార్యాలయాల్లో ఉద్యోగులు ఎంత సమయం వెచ్చించాలో కంపెనీలు పునరాలోచించు కోవాలి. చాలా
కంపెనీలు తమ ఉద్యోగులు ఎక్కువ సమయం కార్యాలయంలో పనిచేయాలని భావిస్తాయి. వర్క్ ఫ్రం
హోమ్ విధానం ఆకర్షణీయంగా లేదు. ఇందుకోసం సాఫ్వేర్ మరింత మెరుగవ్వాలి. సాఫ్ట్ వేర్
ఇంజనీరింగ్ ఆశ్చర్యకరంగా బాగా పనిచేసింది. అయితే చిన్న పిల్లలు ఉన్నా, ఇల్లు చిన్నదైనా, పనులున్నా విధులకు కష్టం. మహిళలు
అయితే వారు నిర్వహించడానికి చాలా విషయాలున్నాయి. కాబట్టి వర్క్ ఫ్రం హోమ్ విధానం లో
చాలా లోపాలు ఉన్నాయి అని అన్నారు. పనికోసం ఈ ఏడాది తాను ఎక్కడికీ ప్రయాణించలేదని
చెప్పారు. 'చాలా ఎక్కువ పని చేయడానికి సమయం లభించింది. ఇది నాకు కనువిప్పు'
అని వ్యాఖ్యానించారు.
జనాభాయే భారతకు సవాల్..
భారత్ విషయానికి వస్తే లాక్ డౌన్
సమయంలో లబ్దిదారులకు నగదు బదిలీకి డిజిటల్ మౌలిక వస తులను వినియోగించడం వంటి
అద్భుతమైన పనులు చేశారు. కానీ జనాభాయే భారత్ కు సవాలు' అని బిల్‌గేట్స్
వివరించారు.
0 Komentar