World rankings released on Wednesday by
renowned Times Higher Education
టైమ్స్ రాంకింగ్స్ లో AP లో SVU నెంబర్ 1, రెండో స్థానంలో ఏఎన్‌యూ
ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్
సంస్థ బుధవారం విడుదల చేసిన వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ
వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నంబర్‌వన్‌గా నిలిచింది. ఆ సంస్థ 2021 సంవత్సరానికి
ప్రపంచ ర్యాంకింగ్స్ లో 801-1000 మధ్య ర్యాంక్ పొంది రాష్ట్రంలో నంబర్‌వన్
యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. 1001 ప్లేస్ లో
స్థానం పొంది ఆచార్య నాగార్జున
విశ్వవిద్యాలయం రాష్ట్రంలో రెండో ర్యాంక్ సాధించింది. 93 దేశాలకు చెందిన 1,527
వర్సిటీలు ఈ ర్యాంకింగ్స్ లో పోటీపడ్డాయి. సంప్రదాయ వర్సిటీల్లో తెలుగు రాష్ట్రాల
నుంచి ఉస్మానియా వర్సిటీ మాత్రమే ముందుండగా, ఆంధ్రా వర్సిటీ (విశాఖ), జేఎన్టీయూఏ(అనంతపురం) 1000 ప్లస్ ర్యాంకులు పొందాయి. ఎస్వీయూ ఏపీలో నంబర్
వన్‌గా నిలవడం పట్ల రెక్టార్ జీఎం సుందరవల్లి, రిజిస్టార్
పి.శ్రీధర్ రెడ్డి, రీసెర్చ్ డీన్ ఎస్. విజయభాస్కరరావు హర్షం
వ్యక్తం చేశారు. ఏఎన్‌యూ ఉత్తమ ర్యాంక్ సాధించ డం పట్ల వీసీ ఆచార్య వి.రాజశేఖర్
రికార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి రిజిస్టార్ ఆచార్య కె. రోశయ్య హర్షం వ్యక్తం చేశారు.
0 Komentar