YSR Insurance: Start of survey, benefit
of at least Rs. 2 lakhs to the eligible
వైఎస్సార్ బీమా: సర్వే ప్రారంభం, అర్హులకు
కనీసం రూ.2లక్షల లబ్ది.. పూర్తి వివరాలివే
రాష్ట్రవ్యాప్తంగా వార్డు, గ్రామ
వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తించేందుకు సర్వే చేస్తున్నారు. నిరుపేద
కుటుంబాల వివరాలు, వారి ఆర్థిక పరిస్థితులపై ఆరా
తీస్తున్నారు.
ఏపీలో వైఎస్సార్ బీమా పథకం కింద
లబ్ధి పొందే కుటుంబాలను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టింది. వార్డు, గ్రామ
వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తించేందుకు సర్వే చేస్తున్నారు. నిరుపేద
కుటుంబాల వివరాలు, వారి ఆర్థిక పరిస్థితులు, బియ్యం కార్డు ఉందా.. ఒకవేళ లేకపోతే కారణాలను నమోదు చేసుకుంటున్నారు. ఈ
వివరాలను గ్రామ సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు నమోదు చేసుకుని అర్హులను
ఎంపిక చేస్తున్నారు.
నిరుపేదల, మధ్యతరగతి
కుటుంబాలకు బీమా కల్పించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని తీసుకొచ్చింది.
గతంలోనూ ఈ బీమాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా
అమలు చేశాయి. ఏప్రిల్ నుంచి కేంద్రం ఈ పథకాన్ని ఉపసంహరించుకోవడంతో అమలు బాధ్యతను
పూర్తిగా రాష్ట్రం తీసుకుంది. అసంఘటిత రంగంలోని కార్మికులు, దారిద్య్ర
రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అధికారిక గణాంకాల
ప్రకారం రాష్ట్రంలో 1.50 కోట్ల కుటుంబాలు బియ్యం కార్డుల్ని
కలిగి ఉన్నాయి. వీరందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
కార్మికులు, పేద,
మధ్యతరగతి వర్గాల వారు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం
జీవనాధారాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి కుటుంబాలకు బీమా
పరిహారం అందితే వారికి జీవనం కొనసాగించే వీలుంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం
ఆ కుటుంబాల తరఫున ప్రీమియం మొత్తాలను చెల్లిస్తుంది. 18 నుంచి
50 సంవత్సరాల్లోపు వయసు కలిగిన కార్మికులు ప్రమాదవశాత్తు
మరణించినా, వైకల్యం పొందినా రూ.5 లక్షల
బీమా మొత్తం ఆ కుటుంబానికి అందుతుంది. సహజ మరణమైతే రూ.2 లక్షల
ఆర్థిక సాయం.. 51 నుంచి 70 ఏళ్లలోపు
వారు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా రూ.3
లక్షల పరిహారం వస్తుంది.
0 Komentar