YSR ‘Jala Kala’ starts today .. Free bores
for farmers, details are here..
నేడు వైఎస్సార్ జలకళ ప్రారంభం..
రైతులకు ఉచితంగా బోర్లు, వివరాలివే
సన్న, చిన్న
కారు రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగానే మరో కీలక
నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
రైతులు ఈ పథకం కోసం తమ పరిధిలోని
గ్రామ వాలంటీర్ల ద్వారా.. లబ్ధిదారుడు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్
కార్డు కాపీతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్‌లోనూ అప్లై
చేసుకునే వీలు ఉంది. రైతులు చేసుకున్న దరఖాస్తులు గ్రామ సచివాలయం స్థాయిలో వీఆర్వో
పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సదరు
దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం ముందుగా జియోలజిస్ట్‌కు పంపుతారు. సాంకేతికంగా
దానిని జియోలజీ విభాగం పరిశీలించి అనుమతి ఇవ్వగానే డ్వామా అసిస్టెంట్ పిడి సదరు
దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. బోరు డ్రిల్లింగ్ వేసేముందు రైతు పొలంలో
హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నిర్వహిస్తారు. ఆ
తర్వాతే బోర్లు వేస్తారు. సదరు అనుమతి అనంతరం కాంట్రాక్టర్ డ్రిల్లింగ్ సైట్ లో
బోరుబావులను తవ్వుతారు. బోరుబావుల సక్సెస్ శాతంను బట్టి కాంట్రాక్టర్‌కు బిల్లుల
చెల్లింపులు జరుపుతారు.
రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల
లోపు భూమి ఉండాలి. ఒకవేళ లేకపోతే రైతులకు అంత భూమి లేకపోతే పక్కనే ఉన్నవారితో
కలిసి బోరు వేయించుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు ఆ భూమిలో అంతకు ముందు ఎలాంటి
బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను
సిద్ధం చేసింది. ఏ రోజు రైతు పొలంలో బోర్ డ్రిల్లింగ్ చేస్తారో అది కూడా అటు రైతు
ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా, ఇటు వాలంటీర్ల ద్వారా కూడా
సమాచారం అందిస్తారు. ఒకవేళ మొదటిసారి బోర్ డ్రిల్లింగ్ లో నీరు పడక విఫలం అయితే,
మరోసారి బోర్ కోసం నిపుణుడైన జియోలజిస్ట్ నిర్ధేశించిన ప్రాంతంలో
డ్రిల్లింగ్ చేసేందుకు అవకాశం కల్పించారు.
0 Komentar