Aadhaar Card - Designed In Credit
Card Size - Convenient To Carry In Wallet
ఆధార్ కార్డ్ - ఇప్పుడు క్రెడిట్
కార్డు పరిమాణంలో రూపకల్పన
ఆధార్ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త
రూపును సంతరించు కుంది. డెబిట్/క్రెడిట్ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. ఇక నుంచి
ఇది పర్స్ లో ఇమిడి పోయేంత చిన్నగా ఉండనుంది. పాలి వినైల్ క్లోరైడ్(పీవీసీ)తో
రూపొందే ఈ కార్డ్ ధరను రూ. 50గా నిర్ణయించారు. ఈ తరహా కార్డులు కావాలనుకున్న
వారు https://uidai.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు
వివరాలను నమోదు చేసి చరవాణికి (మొబైల్) వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. ఆపై కార్డులోని
వివరాలను సరిచూసుకుని కార్డు ధరను డెబిట్/క్రెడిట్ కార్డు, నెట్
బ్యాంకింగ్' చెల్లించాలి. ఆ తరువాత ఆధార్ కార్డ్ లో
పేర్కొన్న చిరునామాకు కొత్త కార్డ్ ను యూఐడీఏఐ పది రోజుల్లో - స్పీడ్ పోస్టు
ద్వారా పంపుతుంది.
0 Komentar