Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AICTE Pragati Scholarship 2020-21 For Btech And Diploma Girls Students

AICTE Pragati Scholarship 2020-21 For Btech And Diploma Girls Students 

బీటెక్‌, డిప్లొమా అమ్మాయిలకు స్కాలర్‌షిప్స్‌.. ఏడాదికి రూ.50,000 పొందే ఛాన్స్‌..

ప్రగతి పథకం కింద అందిస్తున్న ఉపకార వేతనాల సంఖ్యను ఏఐసీటీఈ ఈ ఏడాది భారీగా పెంచింది. 

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్ పేరుతో అమ్మాయిలకు ఆర్థికంగా చేయూతనిస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన అమ్మాయిలు రూ.50,000 వరకు ఆర్థికంగా చేయూత పొందొచ్చు. 

టెక్నాలజీలో డిప్లొమా, డిగ్రీ లాంటి కోర్సులు చేసి ఇంజనీర్లు కావాలనుకునే అమ్మాయిలు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. 2020-21 విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరం(2020-21) స్కాలర్‌షిప్‌ల సంఖ్యను 4వేల నుంచి 10వేలకు పెంచుతూ ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో 5 వేలు బీటెక్‌ విద్యార్థినులకు, మరో 5 వేలు డిప్లొమా విద్యార్థినులకు కేటాయించారు. 

ముఖ్య సమాచారం:

అర్హత: ఏఐసీటీఈ గుర్తింపు పొందిన టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బీటెక్‌/ డిప్లొమా కోర్సులో మొదటి సంవత్సరంలో చేరి ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షలు దాటకూడదు. వివాహం జరిగిన పక్షంలో తల్లిదండ్రులు/అత్తమామ రెండు కుటుంబాల్లో ఎవరి వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉంటుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పటికీ ఈ స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది.

ఎంపిక: ఏఐసీటీఈ సంబంధిత కాలేజీలో బీటెక్‌/పాలిటెక్నిక్‌లో చేరడానికి నిర్వహించే క్వాలిఫైయింగ్‌ పరీక్షలో వచ్చిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

స్కాలర్‌షిప్‌: ట్యూషన్‌ ఫీజు కింద రూ.30 వేలు ఇస్తారు. అలాగే కంటిన్‌జెన్సీ గ్రాంట్‌ కింద ప్రతి సంవత్సరం (10 నెలలు) నెలకు రెండు నెలలు చొప్పున రూ.20 వేలు ఇస్తారు. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం ఉన్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌/ పుస్తకాలు/ వాహనం వంటి వాటిని కొనుగోలు చేయడానికి రూ.30 వేలు ఇస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలకు వెబ్‌సైట్‌: https://www.aicte-pragati-saksham-gov.in/ లేదా

https://www.aicte-india.org/schemes/students-development-schemes

Instructions:

General Instructions 

Previous
Next Post »
0 Komentar

Google Tags