Alert for degree students ..Last
date for online self-reporting is Oct 6th
TS: డిగ్రీ విద్యార్థులకు
అలర్ట్.. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు 6వ తేదీ ఆఖరు
దోస్త్‌కు సంబంధించిన రెండో విడత
డిగ్రీ సీట్ల కేటాయింపు పూర్తయినట్లు కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు.
రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల
ప్రక్రియ కొనసాగుతోంది. దోస్త్‌కు సంబంధించిన రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
పూర్తయినట్లు కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు. ఈ రెండో విడత సీట్ల కేటాయింపులో
దాదాపుగా 65,719 డిగ్రీ సీట్లను కేటాయించామన్నారు. మొదట, రెండు విడతలు కలిపి మొత్తంగా 1,68,184 సీట్ల
కేటాయింపు పూర్తయిందని స్పష్టం చేశారు.
ఇందులో ఎక్కువ మందికి ప్రభుత్వ, ఎయిడెడ్
డిగ్రీ కాలేజీల్లోనే ప్రవేశాలు దక్కాయి. రెండో విడత సీట్లు పొందినవారు
అక్టోబర్ 6వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్
చేయాలన్నారు. అలాగే ఈ నెల 5 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్ల
ప్రక్రియ కొనసాగుతుందని.. ఇంకా 2,41,266 డిగ్రీ సీట్లు
మిగిలి ఉన్నట్లు లింబాద్రి తెలిపారు.
ఇక మూడో విడత ప్రవేశాల కోసం ఈనెల 5వ
తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, 6వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు
అందుబాటులో ఉంటాయి. అయితే గత ఏడాదికంటే ఈసారి దాదాపు 20
శాతం వరకు అడ్మిషన్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 123 ప్రభుత్వ, 41 ఎయిడెడ్ కాలేజీలలో మొత్తం 86,025 సీట్లు ఉండగా, 56,865 సీట్లు భర్తీ అయ్యాయి. 9 వర్సిటీ కాలేజీల్లో తొలివిడతలో 2,818 సీట్లు
భర్తీకాగా.. రెండోదశలో 1,376 సీట్లు కేటాయించారు. ఇంకా 124 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
0 Komentar