All the Examinations Postponed in
Telangana: Minister Sabitha
తెలంగాణ లో అన్నీ పరీక్షలు వాయిదా:
మంత్రి సబితా
తెలంగాణలో జరగాల్సిన పరీక్షలన్నింటినీ దసరా వరకు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్, కాకతీయ విశ్వవిద్యాలయం, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పలు పరీక్షలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో దసరా వరకు పరీక్షలను వాయిదా వేసినట్లు మంత్రి వివరించారు.
0 Komentar