Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Amazing Health Benefits of Milk and Honey Combination

Amazing Health Benefits of Milk and Honey Combination
పాలు తేనె కలిపి తాగితే ఎన్నో ప్రయోజనాలు

పాలు, తేనె లో ఎన్నో పోషకవిలువలున్నాయి. అవి విడివిడిగానే ఎంతో మేలు చేస్తే, కలిపి ఇంకెంత మేలు చేస్తాయో. వీటిని తాగడం వల్ల ఆరోగ్యం దగ్గర్నించీ, మెరిసే జుట్టు వరకూ ఎన్నో లాభాలు ఉన్నాయి. పాలలో కొంచెం తేనె కలుపుకుని ఎందుకు తాగితే ఏమేం లాభాలు ఉన్నాయో తెలుసుకోండి. 

1. జీర్ణశక్తి పెరుగుతుంది

తేనె వల్ల జీర్ణకోశంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. పాలలో కొన్ని చుక్కలు తేనె వేసి తాగితే బ్లోటింగ్, కాన్స్టిపేషన్, క్రాంప్స్ వంటివి తగ్గుతాయి. 

2. శక్తినిస్తుంది

పొద్దున్నే చల్లని పాలూ, తేనె తీసుకెంటే రోజంతటికీ కావాసిన శక్తి లభిస్తుంది. కావల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ అన్నీ లభిస్తాయి. 

3. మంచి నిద్ర పడుతుంది

రాత్రి పడుకునేముందు కనక పాలు, తేనె తీసుకుంటే మెదడు నుంచి శరీరానికి అంతా బానే ఉంది అన్న ఒక సిగ్నల్ వెళ్తుంది. దాంతో హాయిగా నిద్ర పడుతుంది. 

4. ఎముకలకి బలాన్నిస్తుంది

పాలలో ఎముకలకి కావాల్సిన కాల్షియం ఉంటుంది. కానీ, తేనె తో కలిపి తీసుకోడం వల్ల శరీరం ఈ కాల్షియం ని బాగా అబ్జార్వ్ చేసుకోగలుగుతుంది. వయసు పైబడిన పెద్దవారికి ఇది చాలా మంచిది. 

5. యాంటీ-బాక్టీరియల్ గుణాలున్నాయి

పాలూ, తేనె రెండింటిలోనూ యాంటి-బాక్టీరియల్ గుణాలున్నా కలిపి తీసుకుంటే ఆ ఎఫెక్ట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. గోరువెచ్చటి పాలలో తేనె కలిపి తాగడం వల్ల జలుబు, దగ్గు వంటివి రాకుండా చేస్తుంది. 

6. శ్వాసకోశ సమస్యలని దూరం చేస్తుంది

గోరువెచ్చటి పాలూ, తేనె గొంతులో ఉన్న బాక్టీరియాని తొలగిస్తుంది. అందువల్ల శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి. 

7. ఒత్తిడి తగ్గిస్తుంది

పాలూ, తేనె వల్ల శరీరంలో సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా ఒత్తిడి కలిగించే కార్టిసోల్ లెవెల్ ని ఇవి తగ్గిస్తాయి. 

8. కాన్సంట్రేషన్ పెరుగుతుంది

చల్లని పాలలో తేనె కలిపి తాగితే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. శారీరకంగా మానసికంగా కావాల్సిన శక్తి అందుతుంది. 

9. వ్యాయామానికి ముందు

వ్యాయామం ముందూ తరువాతా ఇది తాగడం వల్ల కావాల్సిన ప్రొటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ శరీరానికి అందుతాయి.

 

పాలు, తేనె కలిపి ఎవరు తీసుకోకూడదు?

- బరువు తగ్గాలనుకునే వారు

- పసి పిల్లలు, రోగ నిరొధక శక్తి తక్కువగా ఉన్నవారు

- పాలు పడని వారు

- ఎలర్జీ ఉన్నవారు

 

రెండేళ్ళ లోపు పిల్లలకి తేనె ఇవ్వకపోడమే మంచిది. అలాగే పాలలో కలిపేటప్పుడు కూడా పాలు తాగే వేడిలో ఉన్నప్పుడే కలపాలి. దీని వల్ల లాభాలు తేనె తక్కువగా కలపడం మీదే ఆధారపడి ఉంటాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

Previous
Next Post »
0 Komentar

Google Tags