Amazon India join hands with IRCTC for
train ticket bookings
అమెజాన్లో రైల్ టికెట్ల బుకింగ్ - తొలి సారి కొనుగోలు చేసేవారికి క్యాష్‌బ్యాక్
రైల్ రిజర్వేషన్ టికెట్లను తమ ప్లాట్ ఫామ్ ద్వారా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఐఆర్‌సిటిసి తో ఒప్పందం చేసుకున్నట్లు అమెజాన్ ఇండియా వెల్లడించింది. తమ యాప్ ద్వారానే రైళ్లలో సీట్ల లభ్యతను, పిఎన్‌ఆర్ స్టేటస్ను కూడా పరిశీలించుకోవచ్చని తెలిపింది. ప్రారంభ ఆఫర్‌గా సర్వీస్, పేమెంట్ గేట్ వే ఛార్జీలు పరిహరిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్ పే ద్వారా రైల్ టికెట్ తొలి సారి కొనుగోలు చేసేవారికి నగదు వెనక్కి ఆఫర్ (క్యాష్‌బ్యాక్) కూడా ఇస్తున్నట్లు పేర్కొంది. అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా కనుక బుక్ చేసుకుంటే, టికెట్ రద్దు అయినా, బుకింగ్ జరగకపోయినా, రిఫండ్ వెంటనే లభిస్తుందని తెలిపింది.
0 Komentar