AP CM Announced Police Recruitment Notification
in December
ఏపీలో నిరుద్యోగులకు సీఎం జగన్
గుడ్‌న్యూస్.. 6,500 పోస్టుల భర్తీ, వివరాలివే
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. విజయవాడలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నోటిఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడ్‌న్యూస్ చెప్పారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. విజయవాడలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నోటిఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్‌లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్ జారీ చేస్తామన్నారు. నాలుగు దశల్లో మొత్తం 6500 పోస్టుల భర్తీ చేస్తామన్నారు.. అలాగే పోలీస్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తామన్నారు.
అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని.. మహిళా సిబ్బందిని ప్రోత్సహించి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి అవగాహన కల్పించామని.. పోలీస్ సేవా యాప్ కూడా తీసుకొచ్చామన్నారు.
విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. కరోనా సమయంలో కుటుంబాలకు దూరంగా ఉండి పోలీసులు విధులు నిర్వహించారని.. కరోనాతో మృతిచెందిన పోలీసులకు సీఎం రూ.50లక్షలు ప్రకటించారని.. పోలీసులకు వీక్లీ ఆఫ్, హోంగార్డుల జీతాల పెంపులాంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. టెక్నాలజీ ఉపయోగించడంలో ఏపీకి 27 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని.. సవాళ్లు ఎదుర్కోవడానికి పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు.
0 Komentar