AP CM Launches APCO Lepakshi Online Portal
- Announces 10 Thousand Assistance for Craft Persons
హస్త కళాకారులకు ఏటా రూ.10
వేలు
రాష్ట్రంలో హస్తకళల ద్వారా
జీవనోపాధి పొందుతున్న వారికి కూడా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం
అందించనున్నట్లు ప్రకటించారు. చేనేత, హస్త కళల ఉత్పత్తులకు
మరింతగా మార్కెటింగ్ కల్పించేందుకు ‘ఆప్కో– లేపాక్షి ఆన్‌లైన్ పోర్టల్’ను సీఎం
క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.
జాతీయ, అంతర్జాతీయ
స్థాయిలో మార్కెటింగ్‌కు అవకాశం.. ఏటా రూ.10 వేల ఆర్థిక
సహాయం వల్ల హస్త కళాకారులకు మంచి జరగాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు జగన్.
ప్రకటించిన రూ.10 వేల సాయాన్ని ఫిబ్రవరి తర్వాత ఇస్తామని
తెలిపారు. జిల్లాల్లో ప్రసిద్ధి పొందిన హస్త కళల ఉత్పత్తులు ఉంటే, వాటిని కూడా ఈ వెబ్ స్టోర్స్‌లోకి తీసుకురావాలని.. ఇప్పుడు చేనేత కారుల
కోసం నేతన్న నేస్తం పథకం ఉంది కాబట్టే, ఆ రంగం బతుకుతోంది
అన్నారు. వృత్తులు బతకాలంటే ప్రభుత్వ సహాయం, అండగా నిలవడం
ఎంతో అవసరమన్నారు.
ఆప్కో ఆన్ లైన్ స్టోర్ ద్వారా
మంగళగిరి,
వెంకటగిరి, మాధవరం, బందరు,
రాజమహేంద్రవరం, ఉప్పాడ, ధర్మవరం,
చీరాల, తదితర చేనేత పట్టు, కాటన్ చీరలు, వస్త్రాలు, డ్రెస్
మెటీరియల్స్, బెడ్ షీట్లు పొందవచ్చు. ఇక లేపాక్షి వెబ్
స్టోర్ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక, పెడన,
చిత్తూరు కళాంకారీ ఉత్పత్తులు, దుర్గి రాతి
శిల్పాలు, బుడితి ఇత్తడి వస్తువులు, శ్రీకాకుళం
ఆదివాసీ పెయింటింగ్లు, ఉదయగిరి చెక్క కళాఖండాలు, బొబ్బిలి వీణ, ధర్మవరం తోలుబొమ్మలు అందుబాటులో
ఉంటాయి' అని వెల్లడించారు. 'అమెజాన్,
ఫ్లిప్ కార్ట్, మింత్ర, అజియో,
పేటీఎమ్, గోకోప్, మిర్రా
వంటి ఈ-ప్లాట్ ఫామ్ లలోనూ చేనేత, హస్తకళల ఉత్పత్తులు
అందుబాటులో ఉంటాయి. ఆ మేరకు ఆయా సంస్థలతో లేపాక్షి, ఆప్కోలు
ఒప్పందాలు చేసుకున్నాయి' అని సీఎం వివరించారు.
0 Komentar