Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Degree online admissions from this year

 

Degree online admissions from this year - Reservation in private colleges as well

ఈ ఏడాది నుంచే డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు -  ప్రైవేటు కళాశాలల్లోనూ రిజర్వేషన్ అమలు

డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఆన్లైన్ ప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు బీఎస్సీ చదవాలంటే ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులు ఉండాల్సిందే. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే ఇంటర్ ఉత్తీర్ణులై ఉంటే చాలు.. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, అటానమస్ డిగ్రీ కళాశాలల్లో - 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్ ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీలో 85% సీట్లు స్థానికులకు, 15% సీట్లు స్థానికేతరులకు కేటాయించనున్నారు. ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలకు కూడా రిజర్వేషన్ విధానం అమలు కానుంది.

* చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారిని... శ్రీ వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, యోగి వేమన, రాయలసీమ, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాల పరిధిలో ప్రవేశాలకు స్థానికులుగా పరిగణిస్తారు.

* ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారిని ఆంధ్రా, ఆచార్య నాగార్జున, కృష్ణా, ఆదికవి నన్నయ, డాక్టరు బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయాల పరిధిలో ప్రవేశాలకు స్థానికులుగా పరిగణిస్తారు.

* మొత్తం సీట్లలో సూపర్ న్యూమరీగా 10% సీట్లను ఈడబ్ల్యుఎస్(ఆర్థికంగా వెనకబడిన బలహీనవర్గాలు) కోటాగా కేటాయిస్తారు.

* ప్రతి కోర్సులోనూ మహిళల కోటా కింద 33.33% వర్తింపజేస్తారు. ఎన్‌సీసీ కోటాలో 1% సీట్లు కేటాయిస్తారు.

* ఇంటర్‌లో కామర్సు ఒక సబ్జెక్టుగా చదివిన వారికి రాష్ట్రస్థాయిలో బీకామ్ లో 60% సీట్లు కేటాయిస్తారు. సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ చదివిన వారికి.. బీఏ కోర్సుల్లో 50% సీట్లు కేటాయిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags