AP EAMCET 2020 Rank Card Released
ఏపీ ఎంసెట్ 2020 ర్యాంక్ కార్డు విడుదల చేయబడింది
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్,
ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్ 2020 పరీక్షలు Sep 25 తో ముగిశాయి. ఆన్‌లైన్ (సీబీటీ)
విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు.
మొత్తం 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా.. 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు. ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి సమాధానాల ప్రాథమిక కీ Sep 26 నా విడుదల చేశారు. క్రిందటి నెల 28 వరకు అభ్యంతరాలను దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఏపీ ఎంసెట్ ఫలితాలను ఈ నెల 10 నా విడుదల చేశారు. ఇప్పుడు ర్యాంక్ కార్డ్ ని విడుదల చేశారు. కౌన్సెలింగ్ తేదీలను కూడా త్వరలో విడుదల చేయనున్నారు.
0 Komentar