AP-EAMCET Web Counseling from today
నేటి నుంచి ఎంసెట్ వెబ్‌కౌన్సెలింగ్
కాకినాడలో రెండు కేంద్రాలు
బీటెక్ ఇంజనీరింగ్, బీఫార్మశీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎంసెట్ 2020 వెబ్‌కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభంకానుంది. వెబ్ కౌన్సెలింగ్‌లో ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు పాల్గొనవచ్చు. జిల్లావ్యాప్తంగా ఇంజనీరింగ్ పరీక్షను14,867 మంది రాయగా 12,648 విద్యార్థులు అర్హత సాధించారు. జిల్లాలో 32 ప్రైవేట్, ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా వాటిలో 12,000 సీట్లు అందు బాటులో ఉన్నాయి. వాటిలో 9,000 కన్వీనర్ కోటా సీట్లు కాగా మిగతావి మేనేజ్‌మెంట్ సీట్లు. ఇక జిల్లాలో వెబ్‌కౌన్సెలింగ్‌కు జేఎన్టీయూకే క్యాంపస్‌లోని యూసీఈకే కళాశాల, కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక ఎన్‌సీసీ, పీహెచ్‌సీ, స్పోర్ట్స్, సైనిక కుటుంబాలు, ఆంగ్లోఇండియన్ వంటి ప్రత్యేకత కలిగిన అభ్యర్థులు మాత్రం విజయవాడ బెంజిసర్కిల్లోని విజయవాడ ప్రభుత్వపాలిటెక్నిక్ కళాశాలలో హాజరుకావాల్సి ఉంటుంది. సీఏపీ అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లోని సహాయకేంద్రాలకు వెళ్లవచ్చు.
ఆన్‌లైన్ వెబ్‌కౌన్సెలింగ్ ఇలా...
23 నుంచి ఆన్‌లైన్‌లో ఫీజు
చెల్లించాకా ప్రింట్ తీసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సమయంలో ఫెయిల్యూర్‌వస్తే
మళ్లీ చెల్లించి ప్రింట్‌తీసుకోవాలి. మొదట చెల్లించిన ఫీజు వారి ఖాతాలకు
జమవుతుంది. అనంతరం ఎంసెట్ ఆన్ లైన్ దరఖాస్తులో పేర్కొన్న సెల్ నెంబర్‌కు
రిజిస్ట్రేషన్ లాగిన్ ఐడీ నెంబరు వివరాలు ఎస్‌ఎంఎస్ ద్వారా అం దుతాయి.
అలాఅందితే ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్టు. లేదంటే సహాయకేంద్రాల్లో ధ్రువపత్రాల
పరిశీలన చేయించాలనే సందేశం వస్తుంది. లాగిన్ ఐడీ ద్వారా పాస్‌వర్డ్ క్రియేట్
చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవాలి. అయితే ధ్రువపత్రాల పరిశీలనకు మాత్రమే
షెడ్యూల్ విడుదల చేశారు.
ఓసీ, ఓబీసీలు రూ.1200,
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600 చొప్పున ఫీజును ధ్రువపత్రాల పరిశీలనకు ముందుగానే చెల్లించాలి.
ఇక ధ్రువపత్రాల పరిశీలన 23న
1 నుంచి 20,000 ర్యాంకు వరకూ,
24న 20001 నుంచి 50000 వరకూ,
25న 50001 నుంచి 80000 వరకూ,
26న 80001 నుంచి 110000 వరకూ,
27న 110001 నుంచి చివరి ర్యాంకు వరకూ
నిర్వహిస్తారు.
0 Komentar