Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Grama Sachivalayam Result-2020 – Here is the cut-off marks and Next process details

 


AP Grama Sachivalayam Result-2020 – Here is the cut-off marks and Next process details

ఏపీ గ్రామ‌/వార్డు స‌చివాల‌య ప‌రీక్ష‌ల టాపర్లు, క‌టాఫ్ మార్కులు.. తదుపరి ప్రక్రియ వివరాలు ఇవే..!

సచివాలయ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి.. తదుపరి ప్రక్రియ వివరాల్లోకెళ్తే..

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలు నేడు (అక్టోబర్‌ 27) విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన క‌టాఫ్ మార్కుల వివ‌రాలు కేట‌గిరీల వారీగా ఇలా ఉన్నాయి.


నోటిఫికేషన్ నాటికి 16208 పోస్టులు ఖాళీ

ప్రస్తుతానికి ఉన్న ఖాళీలు 180408 

 

ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా 111 మార్కులు

బీసీ కేటగిరిలో అత్యధికంగా 111 మార్కులు

ఎస్సీ కేటగిరిలో అత్యధికంగా 99.75 మార్కులు

ఎస్టీ కేటగిరిలో అత్యధికంగా 82.75 మార్కులు

మ‌హిళా అభ్య‌ర్థుల్లో గ‌రిష్ఠంగా 98 మార్కులు

పురుష అభ్య‌ర్థుల్లో గ‌రిష్ఠంగా 111 మార్కులు సాధించారు.

 

టాపర్ల జాబితా:

ఏపీ గ్రామ‌, వార్డ్ సచివాల‌య ప‌రీక్ష‌ల టాప‌ర్ల వివ‌రాల‌ను ఏపీ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. వీరిలో ఏ.బాలాజీ 150 మార్కుల‌కు గాను 111 మార్కుల‌తో మొద‌టి స్థానం సాధించారు. త‌రువాత 105.25 మార్కుల‌తో కుందుల పూజా విహారి, 102.25 మార్కుల‌తో ఏ. చైత‌న్య మాధ‌వుడు వ‌రుస‌గా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

 

ఫలితాలు విడుదల:

(అక్టోబర్‌ 27) ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు కింది వెబ్‌సైట్లలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

ఫలితాలకు డైరెక్ట్‌ లింక్‌: https://apgsvam20reports.apcfss.in/apVswsResult20201099451478.apgs

http://gramasachivalayam.ap.gov.in/

http://vsws.ap.gov.in/

http://wardsachivalayam.ap.gov.in/

 

తదుపరి ప్రక్రియ:

ఫలితాల ప్రకటన అనంతరం ఆయా జిల్లాలో అందుబాటులో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జిల్లా కలక్టర్లు మెరిట్ లిస్టు ప్రకారం అర్హులైన అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం ఎంపిక చేసి ప్రొవిజనల్ సెలక్షన్ లెటర్ పంపుతారు .

ప్రతీ పోస్టుకు క్వాలిఫయింగ్ మార్కులను పోస్టుల లభ్యతను బట్టి ఆయా జిల్లా కలక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా సెలక్షన్ కమిటీలు నిర్ణయిస్తాయి.

ఎంపిక అయిన అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రతులను వెబ్‌సైట్‌ నందు అప్లోడ్ చేయవలెను.

తరువాత జిల్లా కలక్టర్ల ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు వెళ్లి వారి సర్టిఫికేట్ లను తనిఖి చేయించుకోవాలి.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం నియామక ఉత్తర్వులు అందజేస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags