AP Grama Sachivalayam Result-2020 – Special
Cell for Complaints
గ్రామ, వార్డు
సచివాలయ నియామకాలు.. ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు.. కంట్రోల్ రూం నెంబర్లు
ఇవే..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేశారు. సందేహాల నివృత్తి కోసం ఫోన్ చేయాల్సిన కమాండ్ కంట్రోల్ రూం నంబర్లకు 9121296051/52/53 ఫోన్ చేయొచ్చు. అభ్యర్దులు ఫిర్యాదులను లిఖిత పూర్వకంగా గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఈ-మెయిల్ ద్వారా పంపాలి. ఏ శాఖకు సంబంధించిన ఫిర్యాదు ఆ శాఖ మెయిల్‌కు మాత్రమే పంపించాలి.
మెయిల్ ఐడి వివరాల కోసం
http://gramasachivalayam.ap.gov.in/ లేదా
http://wardsachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.
ఇక పరీక్షల విషయానికొస్తే.. సెప్టెంబర్ 20 నుంచి 26 తేదీల మధ్య వారం రోజుల పాటు జరిగిన 14 రకాల రాత పరీక్షల ఫలితాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులందరికీ ఈసారి మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. ఆ ర్యాంకుల ఆధారంగా.. జిల్లాల వారీగా ఖాళీలను ఆయా జిల్లాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో రిజర్వేషన్లు పాటిస్తూ మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్ ఇచ్చే నాటికి రాష్ట్రంలో 16,208 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఫలితాలు వెల్లడించే నాటికి ఆ సంఖ్య 18,048కి పెరిగింది. జిల్లాల్లో మెరిట్ లిస్ట్ నుంచి కేటగిరీ ఆధారంగా 18,048 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి త్వరలో స్పష్టత వస్తుంది.
0 Komentar