AP HMFW JOBS: 2842 Jobs in AP - Deadline for Application in 2 Days
ఏపీలో కొత్తగా 2842 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు
ఏపీలో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో వివిధ పథకాల అమలుకు ఈ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చింది.
ఏపీలో ఉద్యోగ నియామకాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది భారీగా నియామకాలు చేపట్టిని జగన్ సర్కారు ఇప్పుడు కొత్తగా మరో 2,842 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో వివిధ పథకాల అమలుకు ఈ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే:
పోస్టుల వివరాలన్నీ జిల్లా ఆరోగ్య
శాఖ అధికారి కార్యాలయంలో ఉంటాయి.
దరఖాస్తులు అక్కడే ఇస్తారు.
దరఖాస్తుతో పాటు, ధ్రువపత్రాలు జతచేసి గడువులోగా డీఎంహెచ్‌వో
కార్యాలయంలో ఇవ్వాలి.
నియామకం జరిగే పోస్టుల్లో సుమారు 30
కేటగిరీలకు పైనే ఉన్నాయి.
ఎక్కువగా మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు,
ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు,
డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలా రకరకాల పోస్టులున్నాయి.
2,842 పోస్టులు కాకుండా మరో
40 రాష్ట్ర స్థాయి పోస్టులను కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన
కార్యాలయం నుంచి భర్తీ చేస్తారు.
అర్హత, పోస్టుల
వివరాలు వంటివన్నీ కుటుంబ సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.
గుంటూరు, ప్రకాశం
జిల్లాల పోస్టులకు అక్టోబర్ 12, పశ్చిమ గోదావరి జిల్లా
పోస్టులకు 14, మిగిలిన జిల్లాల్లో ఈనెల 10 దరఖాస్తుకు చివరితేది.
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి
వివరాలు http://hmfw.ap.gov.in/
వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
జిల్లాల వారీగా ఖాళీలు:
శ్రీకాకుళం - 229
విజయనగరం - 217
విశాఖపట్నం - 322
తూర్పు గోదావరి - 326
పశ్చిమ గోదావరి - 159
కృష్ణా - 171
గుంటూరు - 160
ప్రకాశం - 194
నెల్లూరు - 76
చిత్తూరు- 194
కడప- 296
కర్నూలు - 322
అనంతపురం - 176
0 Komentar