AP: Inter online admissions from today -
User Manual for Online Admission
ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలు నేటి
నుంచి
ఇంటర్మీడియట్ మొదటి ఏడాది
ప్రవేశాలకు ఇంటర్ విద్యా మండలి మంగళ వారం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ప్రైవేటు, ఎయిడెడ్
కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు ఆన్లైన్లో కళాశాల, కోర్సులను
ఎంపిక చేసుకోవాలని బోర్డు కార్యదర్శి రామకృష్ణ సూచించారు. బుధవారం నుంచి ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్లో ఇచ్చికాలు
ఇచ్చే అవకాశం కల్పించారు. ఈ సారి ప్రైవేటు కళాశాలల్లోనూ రిజర్వేషన్ కోటా సీట్లు
ఉంటాయి. ప్రవేశాలకు ప్రాసెసింగ్ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ధ్రువపత్రాలు
నంబర్లు నమోదు చేస్తే సరిపోతుంది. సీట్ల కేటాయింపు వివరాలపై సెల్ ఫోనుకు సందేశం
వస్తుంది. పూర్తి వివరాలు https://bie.ap.gov.in వెబ్ సైట్లో
తెలుసుకోవచ్చు. సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబరు 1800 2749868కు
ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని రామకృష్ణ సూచించారు.
0 Komentar