AP: Inter online admissions from
tomorrow - User Manual for Online Admission
రేపటి నుంచి ఇంటర్ ఆన్ లైన్
ప్రవేశాలు 2020-21
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆన్లైన్
ప్రవేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మొదటిసారి ఆన్లైన్
ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఎక్కడి నుంచైనా కళాశాలలో సీటు కోసం
దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి విద్యార్హత ధ్రువపత్రాలను సమర్పించాల్సిన అవసరం
లేదు. పదో తరగతి హాల్‌టికెట్ నెంబర్, కుల, ఆదాయ ధ్రువపత్రాల నంబర్లు వేస్తే సరిపోతుంది. దరఖాస్తుల స్వీకరణకు వారం
లేదా పది రోజుల సమయం ఇవ్వనున్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలకు కొత్త రుసుములను
నిర్ణయించలేదు. పాత రుసుములనే తీసుకోవాలి. ప్రైవేటులోనూ రిజర్వేషన్లు అమలు
కానున్నాయి. విద్యార్థులు ఎంపిక చేసుకున్న కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, రుసుము, అకడమిక్ వివరాలు వెబ్ సైట్లో అందుబాటులో
ఉంటాయి.
0 Komentar