AP Motor Vehicles ACT-2020 – Huge hiked fines
on violation of road and transport rules
ఏపీ మోటారు వాహనాల చట్టం-2020
- రహదారి మరియు రవాణా నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీగా జరిమానాలు
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే షాక్ కొట్టే రీతిలో ఫైన్‌లు విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ జీవో ప్రకారం.. ఇకపై బైక్ (ద్విచక్ర వాహనాలు)ల ఆటోలు, క్యాబ్‌ల నుంచి 7 సీటర్ కార్ల వరకూ ఒకే విధమైన జరిమానా విధించనున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఎవరైనా సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10,000, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు, రెండో సారికి రూ. 10 వేల జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ. 2 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అలాగే పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ. 20 వేలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ ఉత్తర్వులు మరియు జరిమానాల జాబితా..👇
0 Komentar