AP NGO Press Note on Two DAs and pending salaries, DAs in November
రెండు డిఏలు,
పెండింగ్ జీతాలకు సిఎం అంగీకారం, నవంబర్ లోనే డిఏలు
- పత్రికా ప్రకటన
ఏ.పి. ఎన్డీవో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గం ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో 22-10-2020 తేదీన కలసింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన బకాయిలు, రాయితీలు, వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చి వాటికి సంబంధించిన వినతి పత్రాలను అందించారు.
కరోనా మహమ్మారి వల్ల కుంటుపడిన ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో వుంచుకుని మార్చి, ఏప్రిల్ నెలలలో ఉద్యోగులకు నిలిపి వేసిన 50% జీతాలను మరియు మార్చి నెలలో నిలిపివేసిన పెన్షన్ దారుల సగం నెల పెన్షనను వెంటనే చెల్లించాలని కోరారు.
జూలై 1, 2018, జనవరి 1, 2019 మరియు జూలై 1, 2019 నుండి బకాయివున్న మూడు విడతల డి.ఎ.లను వెంటనే విడుదల చేయాలని కోరారు.
11వ పి.ఆర్.సి. నివేదికను కమీషన్ గారు అందజేసినందున కాలాతీతం లేకుండా ఉద్యోగ సంఘ నాయకులతో వెంటనే చర్చించి జూలై 1, 2018 నుండి 55% ఫిట్ మెంట్ తో పి.ఆర్.సి.ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ ఇచ్చిన నివేదిక మీద తక్షణమే నిర్ణయాలు తీసుకుని సి.పి.ఎస్.ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోనికి తీసుకొని రావాలని కోరారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ ఇచ్చిన నివేదికను పరిశీలించి కాంట్రాక్టు ఉద్యోగులందరిని వెంటనే క్రమబద్ధీకరించవలెనని కోరారు.
గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ నాయకులు, తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఒకే చోట 9 సంవత్సరాలు పనిచేయ వచ్చనే నిబంధనను పునరుద్ధరించాలని కోరారు.
మహిళా ఉపాధ్యాయులతో సమానంగా
రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ ప్రతి సంవత్సరంలో 5
రోజులు అదనపు ఆకశ్మిక సెలవులను మంజూరు చేయాలని కోరారు.
కోవిడ్ సోకిన అన్ని శాఖల ఉద్యోగులకు 30 రోజులు స్పెషల్ క్యాజ్వల్ లీప్ ను మంజూరు చేయాలని, అలాగే కోవిడ్ విధులు నిర్వహిస్తూ మరణించిన అన్ని శాఖల ఉద్యోగుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించాలని కోరడమైనది.
4వ తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మిగిలిన ఉద్యోగులకు పెంచిన విధంగా రెండు సంవత్సరాలు పొడిగిస్తూ పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు.
కమర్షియల్ టాక్స్ శాఖలో పని చేసే అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గూడ్స్ & సర్వీస్ టాక్స్ ఆఫీసర్ కు గెజిటెడ్ హెూదా కల్పించాలి.
రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ వారు పనిచేసే ప్రాంతాలలో ఇంటి స్థలాలను మంజూరు చేయాలని కోరడం జరిగినది.
ఉద్యోగుల ఆరోగ్య కార్డులను అన్నీ ఆసుపత్రులలో, అన్ని జబ్బులకు నగదు రహిత వైద్యం జరిగే విధంగా చూడాలని, మరియు హైదరాబాద్, మద్రాస్, బెంగుళూరులలో వున్న ప్రయివేట్ ఆసుపత్రులలో ఇ.చ్.ఎస్. వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి.
మన రాష్ట్రంలో ఇ హెచ్.ఎస్.కు వైద్యం అందించుటకు నిరాకరించిన ఆసుపత్రుల యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక సంవత్సరం మెడికల్ రీయింబర్స్ మెంటును కొనసాగిస్తూ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని కోరారు.
కోవిడ్ సోకి మరణించిన కాంట్రాక్ట్, అవుట్ స్సోరింగ్ ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగము ఇవ్వాలని కోరారు.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, మరియు ఉద్యోగస్తులు కోరిన వెంటనే జి.పి.ఎఫ్. అడ్వాన్సును చెల్లించే విధంగా చర్యలు తీసుకోవల్సినదిగా కోరడమైనది.
రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏ.పి. ఎన్టీవో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. చంద్రశేఖర్ రెడ్డి పై ఉద్యోగ సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్ళగా వారు సానుకూలంగా స్పందించి ఉద్యోగస్తుల సమస్యలన్నింటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
0 Komentar