AP: Semester Policy from 1st Class
- Complete Changes in the Syllabus ..!
ఒకటో తరగతి నుంచే సెమిస్టర్
విధానం.. సిలబస్‌లో పూర్తి మార్పులు..!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన
నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏపీలో సిలబస్ మారనుంది.
విద్యా వ్యవస్థలో సమూల మార్పుల
దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం
ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా సిలబస్‌ని పూర్తిగా
మార్చనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్ధ నూతన సిలబస్ మార్పులపై భారీ
కసరత్తు చేసింది. దాదాపు పది దేశాల ప్రాథమిక విద్యావిధానాలపై అధ్యయనం చేసి
ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర విద్యా శాఖ కమీషనర్ చినవీరభద్రుడు తెలిపారు.
1 నుంచి 6 వరకు:
దేశంలోని 15
రాష్ట్రాలకి చెందిన ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్‌లని కూడా పరిశీలించి కొత్త సిలబస్‌ని
తయారు చేసే పనిలో పడింది. ఇందుకు గానూ వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న
విద్యావిధానం.. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి విదేశాల విద్యా
విధానాలని పరిశీలించింది. ఇకపై ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు నూతన విద్యావిధానం
ద్వారా మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా దాదాపు 84 రకాల పాఠ్య పుస్తకాలు.. 63 వర్క్ బుక్‌లు
రూపొందించింది.
తెలుగుతోపాటు తమిళం, ఒరియా,
కన్నడ, ఉర్దూ మీడియంలలో కూడా పాఠ్య పుస్తకాలు
ముద్రించింది. అంతేకాక.. మారిన సిలబస్ ప్రకారం ఒకటి, రెండు
తరగతులకి తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు..
మూడు, నాలుగు, అయిదు తరగతులకి తెలుగు,
ఇంగ్లీష్, మేథ్స్, సైన్స్
పాఠ్య పుస్తకాలు.. ఇక ఆరవ తరగతి విధ్యార్ధులకి తెలుగు, ఇంగ్లీష్,
హిందీ, గణితం, సైన్స్,
సోషల్ పాఠ్యాంశాలుగా ఉండనున్నాయని ఆయన పేర్కొన్నారు.
1వ తరగతి నుంచి సెమిస్టర్
విధానం:
దేశంలోనే తొలిసారిగా ఒకటో తరగతి
నుంచే సెమిస్టర్ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ఏపీలో ప్రవేశపెడుతున్నారు.
ఇందుకు తగినట్లుగానే పాఠ్య పుస్తకాలని మూడు సెమిస్టర్‌లలాగా విభజించారు. అలాగే ఒక
పేజిలో తెలుగులో మరో పేజీలో ఇంగ్లీష్‌లో ముద్రించడం ద్వారా ఇంగ్లీష్ బోధన
అర్దమయ్యే రీతిలో పుస్తకాలు రూపొందించారు.
అలాగే తొలిసారిగా విద్యార్థులకు
వర్క్ బుక్స్‌ని.. టీచర్స్ కి, తల్లితండ్రులకి కూడా హేండ్ బుక్స్
ఇవ్వనున్నారు. అంతేకాక విద్యార్థులను ఆకర్షించే విధంగా రంగురంగుల బొమ్మలతో పాఠ్య
పుస్తకాల రూపకల్పన చేసినట్లు చినవీరభద్రుడు తెలిపారు.
0 Komentar