AP Unlock 5.0: Corona ad in movie halls,
sanitation after every period in schools
ఏపీ ప్రభుత్వం అన్‌లాక్ 5.0: సినిమా
హాల్స్‌లో ఇక కరోనా యాడ్, స్కూళ్లలో ప్రతి పిరియడ్ తర్వాత
శానిటైజేషన్.. పూర్తి వివరాలివే!
ఏపీ ప్రభుత్వం అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్‌ను ప్రకటించింది. ప్రజలు కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని తేల్చి చెప్పింది.
కేంద్ర హోం శాఖ జారీ చేసిన కోవిడ్- 19 అన్‌లాక్ 5.0 నిబంధనల్ని నోటిపై చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. అన్ లాక్ 5.0తో కరోనా నుంచి ప్రజల జీవన విధానం దాదాపు సాధారణ స్థితికి వచ్చింది. అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.
ఇకపై రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజా రవాణాలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
మాస్క్ లేకుంటే షాపింగ్ మాల్స్, సినిమా
హాల్స్‌లో ప్రవేశం నిరాకరించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఆయా యాజమాన్యాలకు
తేల్చి చెప్పింది. కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. అలాగే ప్రభుత్వ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో మాస్క్‌లు ధరించేలా ప్రచారం నిర్వహించాలని, మైక్ అనౌన్స్‌మెంట్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. సినిమా హాల్స్‌లో కోవిడ్
నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాని సూచించింది. స్కూళ్లు,
విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు
నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని
ఆదేశించింది. విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత
శానిటైజేషన్ చేసుకునేలా యాజమాన్యాలకు ఆదేశాలు ఇవ్వాలని సూచించింది.
0 Komentar