APSRTC Good news -. Festival Special
buses from today, details
ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త.. నేటి
నుంచి స్పెషల్ బస్సులు, వివరాలివే
స్పెషల్ బస్సులు నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ.. జిల్లాలవారీగా వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు ఓకే, తమిళనాడు బోర్డర్ వరకు బస్సులు.. తెలంగాణపై నో క్లారిటీ.
ఏపీఎస్ ఆర్టీసీ దసరా పండగను సందర్భంగా ఏపీఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి 1,850 బస్సులు ఆయా రూట్లలో తిరగనున్నాయి. ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, కర్ణాటకకు కలిపి 5,950 రెగ్యులర్ సర్వీసులను తిప్పుతోంది. వీటికి అదనంగా 1,850 ప్రత్యేక బస్సులను నడపనుంది. బెంగళూరుకు 562 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పనున్నారు. అయితే కరోనాను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ఇంకా అనుమతించకపోవడంతో ఏపీఎస్ ఆర్టీసీ ఆ రాష్ట్ర సరిహద్దుల వరకే బస్సులను నడపనుంది.
సాధారణంగా ఏటా దసరా పండుగకు 2,500కు పైగా ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసీ నడిపేది. కానీ తెలంగాణతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో ఈ దఫా ప్రత్యేక బస్సుల సంఖ్య తగ్గింది. ఏపీఎస్‌ఆర్టీసీ 1.61 లక్షల కిలోమీటర్లకు పరిమితమై 322 బస్సుల్ని తగ్గించుకునేందుకు సిద్ధపడింది. టీఎస్‌ఆర్టీసీ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. తెలంగాణకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో..ప్రైవేట్ ఆపరేటర్లు పండగ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్ని తిప్పేందుకు సిద్ధమయ్యారు. టికెట్ల ధరలను పెంచి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఏపీఎస్ఆర్టీసీ జిల్లాలవారీగా నడిపే ప్రత్యేక బస్సుల విషయానికి వస్తే.. శ్రీకాకుళం, విజయనగరం–66, విశాఖపట్నం–128, తూర్పుగోదావరి 342, పశ్చిమగోదావరి–40,కృష్ణా–176, గుంటూరు–50, ప్రకాశం–68, నెల్లూరు–156,చిత్తూరు–252,అనంతపురం–228,కర్నూలు–254, కడప–90 బస్సులు నడవనున్నాయి.
0 Komentar