Asha Worker Posts in AP - Application
deadline is tomorrow
AP: ఏపీలో 139 ఆశా వర్కర్ పోస్టులు.. టెన్త్ అర్హత.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేది..!
కర్నూల్ జిల్లాలోని 139 వార్డు సచివాలయాల్లో ఆశా వర్కర్ల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది.
ఆంధ్రప్రదేశ్.. కర్నూల్ జిల్లాలోని 139 వార్డు సచివాలయాల్లో ఆశా వర్కర్ల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు డీఎంహెచ్‌వో కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. NUHM పథకం కింద కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లోని సచివాలయాల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తులు, ఇతర వివరాలు https://kurnool.ap.gov.in/ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. ఈ దరఖాస్తులను నింపి ఈనెల 13వ తేదీ లోగా సంబంధిత అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్‌కు అందజేయాలి. దరఖాస్తులు తప్పనిసరిగా సంబంధిత పట్టణ ఆరోగ్య కేంద్రం (యుహెచ్‌సీ) పరిధిలోని వార్డులో నివాసి అయి ఉండాలి.
ముఖ్య సమాచారం:
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై
ఉండాలి. తెలుగు చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
వయసు: 25
నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 08, 2020
దరఖాస్తుకు చివరితేది: అక్టోబర్ 13, 2020
అర్హుల జాబితా ప్రకటన: అక్టోబర్ 19, 2020
అర్హుల తుది జాబితా ప్రకటన:
అక్టోబర్ 24, 2020
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in/
0 Komentar