Astronauts Reach International Space
Station In Record Time: 3 Hours And 3 Mins
మూడు గంటల్లోనే భువి నుంచి దివికి -
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకున్న ముగ్గురు వ్యోమగాములు
ముగ్గురు రోదసి యాత్రికులు కేవలం మూడు గంటల్లోనే
నేల నుంచి నింగిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) చేరుకున్నారు. ఇంతటి వేగంతో
అక్కడికి ప్రయాణించడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఈ యాత్రకు కనీసం ఆరు గంటల సమయం
పట్టేది. రష్యా స్పేస్ ఏజెన్సీకి చెందిన సెర్గే రిజికోవ్, సెర్గే
కుద్- వెర్చ్కోవ్, నాసాకు చెందిన కేత్ రూబీన్స్ లు బుధవారం
ఉదయం కజకిస్థాన్లోని బైకొనుర్ అంతరిక్ష కేంద్రం నుంచి సోయుజ్ ఎంఎస్-17 రాకెట్ ద్వారా ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. ఆరు నెలలపాటు వారు అక్కడే ఉంటారు.
"ఐఎస్ఎస్లోని రష్యా విభాగం నుంచి ఆక్షీజన్ లీకవుతోంది. దాని కారణంగా
ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు. మేము ఎక్కడ నుంచి ఆక్షీజన్ లీకవుతోందో గుర్తించి,
మరమ్మతులు చేపడతాం. ఇందుకు అవసరమైన సరంజామాను మాతో పాటూ
తీసుకెళ్తున్నాం' అని రిజికోవ్ తెలిపారు. యాత్రకు ముందు ఈ
ముగ్గురూ పలు మార్లు కొవిడ్ పరీక్షలు చేయించుకుని, క్వారంటైన్
లో కూడా ఉన్నారు. వీరు ఐఎస్‌ఎస్ కు చేరుకోవడంతో... గత ఏప్రిల్ నుంచి అక్కడే ఉంటున్న
మరో ముగ్గురు నాసా వ్యోమగాములు వారం రోజుల్లో తిరిగి భూమికి పయనమవుతారు.
0 Komentar