Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BrahMos supersonic cruise missile test fired from Navy’s stealth destroyer

 


BrahMos supersonic cruise missile test fired from Navy’s stealth destroyer

క్షిపణి పరీక్షల్లో మరోసారి సత్తా చాటిన భారత్.. విజయవంతంగా బ్రహ్మోస్ ప్రయోగం

దేశీయంగా రక్షణ రంగానికి సంబంధించి పరికరాలు, ఆయుధాలను ఉత్పత్తి చేసుకోవాలనే సంకల్పంతో ఉన్న భారత్ ఆ దిశగా విజయాలను అందుకుంటోంది.

తూర్పు లడఖ్‌ సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు నెలకున్న వేళ.. భారత్ వరుస క్షిపణి ప్రయోగాలకు ప్రాధాన్యత ఏర్పడింది. నెల రోజుల వ్యవధిలోనే 10 క్షిపణులను ప్రయోగించింది. తాజాగా, మరో క్షిపణి పరీక్షను ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని కోల్‌కతా శ్రేణి డెస్ట్రాయర్‌ ‘ఐఎన్‌ఎస్‌ చెన్నై’నుంచి విజయవంతంగా పరీక్షించారు. అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు డీఆర్‌డీవో ప్రకటించింది. 

బ్రహ్మాస్‌ క్షిపణుల సామర్థ్యం పెంచేందుకు డీఆర్‌డీవో ప్రయోగాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్షిపణులు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించగలవు. తాజా ప్రయోగానికి వినియోగించిన ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌక 2016 నుంచి తన నౌకాదళానికి సేవలు అందజేస్తోంది. ఇండియన్‌ నేవీ ప్రాజెక్టు 15Aలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని అభివృద్ధి చేశారు. అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ చేతుల మీదుగా నౌకదళానికి అప్పగించారు. 

మొత్తం 164 మీటర్ల పొడవు, 7500 టన్నుల బరువున్న ఐఎన్ఎస్ చెన్నై బహుళ ప్రయోజనాలున్న రెండు యుద్ధ హెలికాప్టర్లను తీసుకెళ్లగలదు. ఇది గంటలకు 30 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. బ్రహ్మోస్, బరాక్-8 క్షిపణులు, దేశీయంగా అభివృద్ధిచేసిన యాంటీ సబ్‌మెరైన్ ఆయుధాలు, సెన్సార్లు, భారీ టోర్పెడో ట్యూబ్ లాంచర్లు, రాకెట్ లాంచర్లు ఈ యుద్ధ నౌకలో ఉంటాయి. సెప్టెంబరు 20 కూడా విస్తృత శ్రేణికి చెందిన బ్ర‌హ్మోస్ క్రూయిజ్ క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ రేంజ్ నుంచి ఈ ప్ర‌యోగం నిర్వ‌హించారు. 

తక్కువ పరిధి, ర్యామ్‌జెట్, సూపర్‌ సోనిక్, క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్‌ను ఉపరితలం, సముద్రం (యుద్ధ నౌకల నుంచి), సముద్రం లోపల నుంచి (జలాంతర్గాముల నుంచి), గాలి నుంచి (యుద్ధ విమానాల ద్వారా) ప్రయోగించవచ్చు. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ. 

డీఆర్డీఓ, రష్యాకు చెందిన మషినో స్ట్రోయేనియాలు సంయుక్తంగా, బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసి, భారత్‌లో ఈ క్షిపణిని తయారు చేస్తున్నాయి. రష్యా క్రూయిజ్ క్షిపణి P-800 ఓనిక్స్ సాంకేతికతపై ఆధారపడి ఈ క్షిపణిని రూపొందించారు. భారత దేశంలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కో ఈ రెండు నదుల పేర్లలోని మొదటి భాగాలను కలిపితే ఏర్పడిందే బ్రహ్మోస్.

Previous
Next Post »
0 Komentar

Google Tags