Dr. BR Ambedkar University has extended
the last date for admission to degree and PG courses
డిగ్రీ, పీజీ
కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో
చేరేందుకు చివరి తేదీని పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్
డాక్టర్ జి.లక్ష్మారెడ్డి తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం,
బీఎస్సీ, పీజీలో ఎంఏ, ఎంకాం,
ఎంఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ,
పీజీ డిప్లొమాతోపాటు పలు సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ
గడువు తేదీని అక్టోబరు 22 వరకు పొడిగించామన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయ విద్యా కేంద్రాల్లో ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, రుసుం తదితర వివరాలను www.braouonline.in లో పొందుపర్చినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు, విశ్వవిద్యాలయం నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2019 వరకు ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600 లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 04023680333/555లో సంప్రదించవచ్చన్నారు.
Public administration MA ASSIGNMENT S
ReplyDelete