CBSE 10th Class Compartment
Result-2020 Declared
సీబీఎస్‌ఈ టెన్త్ కంపార్ట్‌మెంట్
ఫలితాలు విడుదల
పదోతరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షల ఫలితాలను సీబీఎస్‌ఈ విడుదల చేసింది.
పదోతరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షల ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విడుదల చేసింది. ఈ పరీక్షకు 1,57,866 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,49,726 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 82,903 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సీబీఎస్‌ఈ ప్రకటించింది.
పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను
http://cbseresults.nic.in/
వెబ్‌సైట్లో చూసుకోవచ్చు.
ఫలితాల కోసం డైరెక్ట్ లింక్: https://results.digitallocker.gov.in/cbse2020.html
మరో లింక్: http://cbseresults.nic.in/class10-Revised_2020/Class10th20_revised.htm
దేశవ్యాప్తంగా 1248 కేంద్రాల్లో సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు కంపార్ట్‌మెంట్ పరీక్షలు జరిగాయి. ఫలితాలను 12 రోజుల వ్యవధిలోనే విడుదల చేశారు. కాగా, సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలను జూలై 15న ప్రకటించింది. అందులో 91.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
0 Komentar