TS: Colleges will start in Telangana
from November 1 ..!
తెలంగాణలో నవంబర్ 1 నుంచి కాలేజీలు ప్రారంభం..!
ఉన్నతవిద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలు నవంబర్ 1 నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది.
తెలంగాణలో ఈనెల 15 నుంచి విద్యాసంస్థల పునః ప్రారంభించడం సాధ్యంకాదని మంత్రుల సబ్ కమిటీ స్పష్టం చేసింది. పండుగల తర్వాత పరిస్థితులను సమీక్షించి స్కూళ్లు ప్రారంభించే విధంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. దసరా, దీపావళీ పండుగల అనంతరం పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు తుది నిర్ణయం వెలువడనుంది.
యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఉన్నతవిద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలు నవంబర్ 1 నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. విద్యాసంస్థలు ప్రారంభమైతే విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికపప్పుడు పరిశీలించేందుకు వైద్య,ఆరోగ్యశాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. బుధవారం ఎంసీహెచ్‌ఆర్డీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్‌తో కూడిన సబ్‌కమిటీ సమావేశమైంది.
ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంవత్సరం ఆగిపోకుండా ఉండేందుకు డిజిటల్ తరగతులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలలను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ సూచనల మేరకు త్వరలోనే చర్యలు చేపడతామన్నారు.
రాష్ట్రంలో 96% మందికి టీవీలున్నాయని.. 40% మందికి ఇంటర్నెట్
సదుపాయం ఉన్నదని తెలిపారు. 86% మందికి ఆన్‌లైన్ విద్య
అందుతున్నట్టు సర్వేలో తేలిందని పేర్కొన్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం ఆన్‌లైన్
విద్య తప్పనిసరి అవుతుందని.. అందరికీ అందేలా చూడటమే ప్రభుత్వం ముందున్న
లక్ష్యమన్నారు. కొవిడ్ నిబంధనల మేరకు సగం మందితోనే తరగతులు నిర్వహించాల్సి
ఉన్నందున మిగతా వారికి ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాల్సి ఉంటుందని చెప్పారు.
0 Komentar