Corona vaccine trials begin in
Vizag - There Volunteers were vaccinated..!
విశాఖలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్
ప్రారంభం.. తొలి రోజే ముగ్గురికి..!
కరోనా వైరస్ వ్యాక్సిన్‌కు
సంబంధించిన క్లినియల్ ట్రయల్స్ సోమవారం విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి.
విశాఖపట్నం నగరంలోని కింగ్ జార్జి
ఆస్పత్రిలో కోవిడ్- 19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్
ప్రారంభమయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ సంస్థ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌పై ఐసీఎంఆర్,
సీరం ఇండియా సంయుక్తంగా పరిశోధనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి
సంబంధించి విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆస్పత్రిలో కూడా కరోనా పరీక్షలు
నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
ఇందులో భాగంగా ఆంధ్ర మెడికల్
కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ సోమవారం తొలి వలంటీర్‌కు వ్యాక్సిన్
అందించారు. మొదటి రోజు ముగ్గురు వాలంటీర్ల కు వ్యాక్సిన్ ఇచ్చారు. మరో 15
రోజుల వ్యవధిలో 100 మంది వలంటీర్లపై క్లినికల్ ట్రైల్స్
నిర్వహించనున్నట్లు డాక్టర్ పీవీ సుధాకర్ వెల్లడించారు.
కాగా, విశాఖలో
కరోనా క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ఏఎంసీ, కేజీహెచ్‌లకు
కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకేసారి రెండు క్లినికల్
ట్రయల్స్ చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ
అనుమతితో పాటు, ట్రయల్స్ నిర్వహించేందుకు డీఎంఈ నుంచి కూడా
పర్మిషన్ వచ్చింది. కాగా, డీఆర్డీవో పర్యవేక్షణలో నివాస్
లైఫ్ సైన్సెస్.. ఐసీఎంఆర్ పర్యవేక్షణలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ట్రయల్స్
నిర్వహిస్తున్నారు. ఇక ఆంధ్ర మెడికల్ కాలేజీ పర్యవేక్షణలో కేజీహెచ్‌లో క్లినికల్
ట్రయల్స్‌ను చేపడుతున్నారు.
0 Komentar