Covid pandemic has peaked in India; can
be controlled by end of Feb 2021: Govt-appointed panel
గుడ్ న్యూస్: కరోనా పీక్ దశ
వెళ్లిపోయింది.. 4 నెలల్లో పూర్తిగా అంతం
India Covid-19: దేశంలో కరోనా వైరస్ పీక్ దశ వెళ్లిపోయిందని ప్రభుత్వం నియమించిన కమిటీ తెలిపింది. ఫిబ్రవరి చివరికి వైరస్ పూర్తిగా అదుపులోకి వస్తుందని తెలిపింది. అయితే.. రానున్నది పండుగల కాలం కావడంతో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది.
కరోనా మహమ్మారితో వణికిపోతున్న ప్రజలకు శుభవార్త. దేశంలో ఫిబ్రవరి నాటికి వైరస్ పూర్తిగా అంతమవుతుందట. వైరస్ వ్యాప్తి ఇప్పటికే పీక్ దశను దాటేసిందట. దేశంలో కొవిడ్-19 వ్యాప్తి అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ వివరాలు చెప్పింది. కొత్తగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం శుభసూచకమని పేర్కొంది. ఇదే సమయంలో పండుగలు వస్తు్న్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళలో ఓనమ్ పండుగ తర్వాత పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదైన విషయాన్ని గుర్తు చేసింది.
భారత్‌లో కరోనా వైరస్ ముమ్మర దశను దాటిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసాంతానికి మహమ్మారి పూర్తిగా అంతం అవుతుందని కమిటీ పేర్కొంది. కొవిడ్-19 నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాలను విధిగా పాటించాలని ప్రజలను కోరింది. 2021 ఫిబ్రవరి నాటికి వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చే సమయానికి దేశవ్యాప్తంగా కోటి ఐదు లక్షల మంది మహమ్మారి బారినపడతారని కమిటీ అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం (అక్టోబర్ 18) పాజిటివ్ కేసుల సంఖ్య 75 లక్షలు.
0 Komentar