CSIR UGC NET 2020: Exam rescheduled, to
be held from November 19
యూజీసీ నెట్ -2020 పరీక్షల కొత్త తేదీలు విడుదల
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ 2020 అర్హత పరీక్షల తేదీలను విడుదల చేశారు.
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో.. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్ అర్హత పరీక్షల తేదీలను విడుదల చేశారు. సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- జూన్ 2020 పరీక్షలను నవంబరు 19, 21, 26 తేదీల్లో జరపాలని జాతీయ పరీక్షలమండలి నిర్ణయించింది. పరీక్షకు కొద్ది రోజుల ముందు హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
యూజీసీ నెట్-2020కి సంబంధించి మొదటి విడత పరీక్షలు సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు, రెండో విడుత పరీక్షలు సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు జరగాల్సి ఉండగా.. వాటిని వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్‌టీఏ) గతంలో ప్రకటన చేసింది.
వాస్తవానికి మే, జూన్ నెలల్లో జరగాల్సిన యూజీసీ నెట్-2020 పరీక్షలు కరోనా కారణంగా సెప్టెంబర్ కు వాయిదా పడ్డాయి. అభ్యర్థులు పూర్తి వివరాలను https://ugcnet.nta.nic.in/ లేదా https://nta.ac.in/ వెబ్‌సైట్‌లలో చూడొచ్చు.
0 Komentar