Cyient Collaborates with SR University
to Help Advance the Field of Additive Manufacturing
స్కిల్ గ్యాప్ తగ్గించేందుకు మరో
ముందడగు
ప్రముఖ ఐటీ సంస్థ సెయింట్, ఎస్‌ఆర్
యూనివర్సిటీల మధ్య తాజా ఎంవోయు కుదిరింది.
అధునాతన అంశాల రూపకల్పన, శిక్షణలో సాయం
ప్రముఖ డిజిటల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ సెయింట్, వరంగల్‌కు చెందిన ఎస్‌ఆర్ యూనివర్సిటీ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రెండు సంస్థలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఒప్పందంలో భాగంగా పరిశ్రమ-ఆధారిత పాఠ్యాంశాలు, ముఖ్యంగా అధునాతన ఉత్పాదక వ్యవస్థలకు సంబంధించిన పాఠ్యాంశాల రూపకల్పనలో ఎస్‌ఆర్ యూనివర్సిటీకి సెయింట్ సాయం చేయనుంది.
ఈ ఒప్పందం డిజైన్ ఫర్ అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ (3 డీ ప్రింటింగ్) లాంటి రంగాల్లో సుశిక్షతులైన వనరుల అవసరం, లభ్యత మధ్య స్కిల్ గ్యాప్‌ను తగ్గించడానికి ఇది సహాయపడుతుందని సెయింట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
సెయింట్.. భారత్‌తోపాటు అమెరికాలో పాలిమర్, మెటల్ ఆడిటివ్ మాన్యుఫాక్చరింగ్ సంస్థలను స్థాపించింది. ఇది ఆడిటివ్ మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీని ప్రమోట్ చేయడంతోపాటు, ఉపయోగిస్తోంది. టూలింగ్, రివర్స్ ఇంజనీరింగ్, అబ్సాలిసెన్స్ మేనేజ్‌మెంట్ లాంటి ఆప్లికేషన్స్‌ను ఉపయోగించి సంకలితంగా అభివృద్ధి చేసిన భాగాలను డెలివరీ చేయడం కోసం సెయింట్ సంస్థకు ఏరోస్పేస్, డిఫెన్స్, మెడికల్ టెక్నాలజీ, ఎనర్జీ, ఇండస్ట్రియల్, ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లో పెద్ద సంఖ్యలో క్లయింట్‌లు ఉన్నారు.
సెయింట్ గత ఏడాది కాంప్రహెన్సింగ్ ఇంటర్నల్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ ద్వారా డిజైన్ ఫర్ ఆడిటివ్ మాన్యుఫాక్చరింగ్‌లో 100 మందికిపైగా శిక్షణ ఇచ్చింది. ఇప్పడు ఆ సంస్థ తన నిపుణతను ఎస్‌ఆర్ యూనివర్సిటీలోని అధ్యాపకులు, విద్యార్థులకు నేర్పనుంది.
0 Komentar