Don’t impose 15day waiting period on
renewal of Corona policies: IRDAI to insurers
కరోనా పాలసీల రెన్యువలకు 'వెయిటింగ్
పీరియడ్' వద్దు
కరోనా కవరేజీ పాలసీలైన 'కరోనాకవచ్',
'కరోనా రక్షక్’ లో 15
రోజుల వెయిటింగ్ పీరియడ్ (వేచి ఉండే -కాలం, 15 రోజుల తర్వాతే క్లెయిమ్ కు అర్హత)ను విధించొద్దని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్‌డీఏఐ) ఆదేశించింది. ఐఆర్‌డీఏఐ విడుదల చేసిన
మార్గదర్శకాల ప్రకారం బీమా సంస్థలు, మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు, తొమ్మిదిన్నర నెలల కాలానికి కరోనా
కవచ్, కరోనా రక్షక్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. కరోనా వైరస్
బారిన పడితే అయ్యే వైద్య, చికిత్సా ఖర్చులను చెల్లిం చేందుకు
ఈ పాలసీలను బీమా సంస్థలు ప్రత్యే కంగా రూపొందించడం గమనార్హం. ఈ పాలసీ రెన్యువల్ కు
(పాలసీ కాలవ్యవధిని పొడిగించుకోవడం), పోర్టబులిటీ (ఒక సంస్థ
నుంచి మరొక సంస్థకు మార్చుకోవడం)కి ఐఆర్డీఏఐ అనుమతించింది.
0 Komentar