EPFO launches WhatsApp helpline service
PF ఖాతాదారులకు శుభవార్త..
కొత్త సర్వీసులు అందుబాటులోకి!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తాజాగా కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ సర్వీసులు లాంచ్ చేసింది. దీంతో పీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనంక కలుగనుంది.
పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు తీపికబురు
కొత్త సర్వీసులు అందుబాటులోకి
త్వరితగతిన సమస్యల పరిష్కారం
పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్నారా? అయితే మీకు తీపికబురు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO తన సబ్‌స్క్రైబర్ల కోసం కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ సర్వీసులు స్టార్ట్ చేసింది. దీంతో పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి ప్రయోజనం కలుగనుంది.
కార్మిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా పీఎఫ్ వాట్సాప్ సర్వీసులు అంశాన్ని తెలియజేసింది. పీఎఫ్ ఖాతాదారులు వారి సమస్యలకు వాట్సాప్ ద్వారానే ఇక పరిష్కారం పొందొచ్చు. కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల్లో వాట్సాప్ సర్వీసుల వల్ల పీఎఫ్ అకౌంట్‌దారులకు బెనిఫిట్ కలుగనుంది.
ఫేస్‌బుక్, ట్విట్టర్ సోషల్ మీడియా పేజీలు, కాల్ సెంటర్, ఆన్‌లైన్ గ్రీవెన్స్ పోర్టల్ వంటి వాటికి ఈ వాట్సాప్ సర్వీసులు అదనమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్ సర్వీసులు 138 ఈపీఎఫ్‌వో రీజినల్ ఆఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. పీఎఫ్ ఖాతాదారులు ఎవరైనాసరే వారి సమస్యను తెలియజేవచ్చు. సలహాలు సూచనలు కోరవచ్చు.
ఈపీఎఫ్‌వో రీజినల్ ఆఫీస్‌లకు సంబంధించిన వాట్సాప్ హెల్ప్‌లన్ నెంబర్లు ఈపీఎఫ్‌వో పోర్టలో అందుబాటులో ఉన్నాయి. ఈపీఎఫ్‌వో, పీఎఫ్ సబ్‌స్క్రైబర్ల మధ్య కమ్యూనికేషన్ పెంచడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడనుంది. అంతేకాకుండా సబ్‌స్క్రైబర్ల సమస్యలకు కూడా త్వరితగతిన పరిష్కారం లభిస్తుంది.
0 Komentar