First Year Degree, BTech classes from
December 1 -
ఫస్టియర్ డిగ్రీ, బీటెక్
తరగతులు డిసెంబరు 1 నుంచి
మిగతా వారికి నవంబరు 2 నుంచి
వచ్చే ఏడాది ఆగస్టు 9 వరకు ఉన్నత విద్యాశాఖ
ఉత్తర్వులు
రాష్ట్రంలో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు
గ్రాడ్యుయేషన్, వృత్తి విద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాల తరగతుల నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ ఉమ్మడి అకడమిక్
కేలండర్‌ను విడుదల చేసింది. డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ మొదటి ఏడాది తరగతులు డిసెంబరు 1 నుంచి ప్రారంభం కానున్నట్లు
శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వారానికి ఆరు రోజులు తరగతులు
నిర్వహించనున్నారు. ఏదైనా కారణంతో ఒకరోజు సెలవు ఇస్తే రెండో శనివారం, ఆదివారం తరగతులు నిర్వహించాలని సూచించింది. జాతీయ సెలవులు, పండుగ రోజులు మినహా ఇతర సమయాల్లో దీన్ని అమలు చేయాలంది. విద్యాసంస్థల్లో
కొవిడ్-19 నిబంధనలు పాటించాలని ఆదేశించింది. 1/3 మందికి 10 రోజుల చొప్పున తరగతులు
నిర్వహించనున్నారు. 90 రోజుల్లో 30 రోజుల పాటు తరగతి బోధన, మిగతా
సమయం ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తారు. తరగతి 45 నిమిషాలు, 5-10
నిమిషాల తర్వాత మరో తరగతి ఉంటాయి.
* 2, 3 సంవత్సరాల వారికి నవంబరు 2 నుంచి డిగ్రీ కళాశాలలు ప్రారంభం
* సెమిస్టర్-3, 5 వారికి అంతర్గత పరీక్షలు: డిసెంబరు 1-5
* వచ్చే ఏడాది మార్చి 6న విద్యా సంస్థలకు సెలవు
* సెమిస్టర్ పరీక్షలు: మార్చి 8 నుంచి
* సెమిస్టర్-4, 6
వారికి తరగతులు: మార్చి 25 నుంచి
* అంతర్గత పరీక్షలు: జూన్ 1-5
* సెమిస్టర్ పరీక్షలు: ఆగస్టు 9 నుంచి బీటెక్, బీఫార్మసీ వారికి తరగతులు
* సెమిస్టర్-3, 5, 7 వారికి తరగతులు: నవంబరు 2న
* అంతర్గత పరీక్షలు: డిసెంబరు 1-5
* వచ్చే ఏడాది మార్చి 6న విద్యాసంస్థలకు సెలవు
* సెమిస్టర్ పరీక్షలు: మార్చి 8 నుంచి
* సెమిస్టర్-4, 6,
8 వారికి తరగతులు: మార్చి 25 నుంచి
* అంతర్గత పరీక్షలు: జూన్ 1-5
* ఆగస్టు 7న విద్యాసంస్థలకు సెలవు
* సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 9
నుంచి
పీజీ పునఃప్రారంభం..
* పీజీ సెమిస్టర్-3 వారికి
తరగతులు ప్రారంభం: నవంబరు 2
* అంతర్గత పరీక్షలు: డిసెంబరు1-5
* వచ్చే ఏడాది మార్చి 6న సెలవు
* సెమిస్టర్ పరీక్షలు: మార్చి 8
నుంచి
* సెమిస్టర్-4 తరగతులు: మార్చి
25న
* అంతర్గత పరీక్షలు: జూన్1-5
* సెమిస్టర్-4 పరీక్షలు: ఆగస్టు 9
0 Komentar