French Open 2020: Rafael
Nadal wins 20th Grand Slam
ఫ్రెంచ్ ఓపెన్ 2020: 20వ సారి
గ్రాండ్ స్లామ్ గెలిచిన రఫేల్ నాదల్
20 వ గ్రాండ్ స్లామ్ తో ఫెదరర్ సరసన
నాదల్
రఫేల్ నాదల్ అరుదైన విజయం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ 2020లో సెర్బియాకు చెందిన క్రీడాకారులు నోవాక్ జోకోవిక్ తో జరిగిన మ్యాచులో 6-0. 6-2. 7-5తో విజయం సాధించి 20వ సారి గ్రాండ్ స్లామ్ గెలిచిన రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేశాడు.
ప్రపంచ నెంబర్. 1 నోవాక్
మంచి ఆటతీరు కనబరచగా 34 సంవత్సరాల నాదల్ అందరి అంచనాలను
తలకిందులు చేస్తూ విజయంతో దూసుకెళ్లాడు. ఒక్క సెట్ కోల్పోకుండా నాదల్ గెలుపు
సాధించాడు.
నాదల్ విజయంతో దూసుకెళ్లగా జోకోవిచ్ )మాత్రం ఈ ఏడాది తొలిసారి ఓటమి రుచిని చవి చూశాడు. అంతకు ముందు యూఎస్ ఓపెన్ నుంచి అనర్హత వేటు వల్ల బయటకు వచ్చాడు. ఈ విజయతో నాదల్, రోజర్ ఫెదరర్ ఇప్పుడు 20 గ్రాండ్ స్లామ్ విజేతల జాబితాలో పోటీలో ఉంటారు.
మరో గ్రాండ్ స్లామ్ ఎవరునెగ్గినా
వారు ముందువరుసలో ఉంటారు. అయితే కీళ్ల సర్జరీ అవడం వల్ల ఫెదరర్ ఈ ఏడాది మొత్తం
ఆటకు దూరంగా ఉండనున్నాడు. అయితే 2021 లో జరిగితే ఆస్ట్రేలియన్ ఓపెన్
టోర్నీలో అతను టైటిల్ నెగ్గితే టాప్ నెంబర్ జాబితాలో టాప్ స్థాయికి వెళ్తాడు.
వచ్చే ఏడాది 40 ఏళ్ల పూర్తి అవుతాయి కాబట్టి అతనికి అదే
చివరి టోర్నీ అవ్వవచ్చు.
0 Komentar