GATE 2021: 14196 Students Registered
from Arts and Commerce
ఆర్ట్స్, కామర్స్
విద్యారులకూ.. ‘గేట్’, తొలి ఏడాదే 14,196 దరఖాస్తులు
జాతీయస్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్)-2021కు తొలిసారి ఆర్ట్స్, కామర్స్ గ్రూపు విద్యార్థులూ పోటీ పడబోతున్నారు. ఈ సారి ఐఐటీలు పలు సంస్కరణలు చేశాయి. ఇందులో భాగంగా ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు కూడా గేట్-2021 రాసి ఐఐటీల్లో పీజీ చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువులు దక్కించుకునే అవకాశాన్ని కల్పించాయి. దీంతో దేశవ్యాప్తంగా బీఏ, బీకాం గ్రూపులకు చెందిన 14,196 మంది విద్యార్థులు దరఖాస్తు చేయడం విశేషం. గేట్‌ను ఈసారి ఐఐటీ ముంబయి నిర్వహిస్తుండగా.. అక్టోబరు 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆన్‌లైన్ పరీక్షల్లో అర్హత సాధించిన ఇంజినీరింగ్ విద్యార్థులు ఐఐటీల్లో ఎంటెక్ చదవొచ్చు. ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు ఎంఏ, మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరొచ్చు. మరోవైపు కొన్ని ఐఐటీలు ఇంజినీరింగ్ విద్యార్థులకు నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశాన్నీ కల్పిస్తున్నాయి.
8.82 లక్షల దరఖాస్తులు
గతేడాదితో పోల్చితే ఈసారి దరఖాస్తుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గేట్-2020కి 8.77 లక్షల మంది దరఖాస్తు చేయగా.. ఈసారి ఆ సంఖ్య 8.82 లక్షలకు చేరింది. మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులే ఎక్కువగా గేట్ రాస్తున్నారు. మెకానికల్ విభాగానికి చెందిన 1.60 లక్షల మంది విద్యార్థులు, సివిల్‌కు చెందిన 1.50 లక్షలు, కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన 1.46 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఇందులో 2.90 లక్షల మంది విద్యార్థినులు ఉన్నారు. గతేడాది వారి సంఖ్య 2.80 లక్షలే. ప్రతియేటా ఏపీ, తెలంగాణ నుంచి 1.25 లక్షల మంది గేట్ రాస్తుంటే.. వారిలో 15-20 శాతం మంది ఉత్తీర్ణులవుతున్నారు.
0 Komentar