GATE 2021 Application Form Correction
(Open) – Change City, Paper, Category
గేట్-2021 అభ్యర్థులకు అలర్ట్.. అప్లికేషన్‌లో వివరాలు మార్చుకునే ఛాన్స్..!
గేట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏదైనా తప్పులు చేసుంటే సరి చేసుకోవచ్చు.
గేట్-2021 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఐఐటీ-ముంబై కీలక మరోఅవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకునే సమయంలో ఏదైనా తప్పులు చేసుంటే సరి చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో అభ్యర్థులు పరీక్ష రాసే సిటీ, కేటగిరీ, జెండర్, ఇతర వివరాలను మార్చుకునే అవకాశం ఏర్పడింది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే.. పరీక్ష కేంద్రాన్ని ఉచితంగానే మార్చుకునే అవకాశం కల్పించారు. కేటగిరీ, జెండర్, పేపర్ మార్చుకోవడానికి ప్రత్యేక చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ కరెక్షన్ అవకాశం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 13 వరకు ఉంటుంది. అయితే ఓకే సారి మాత్రమే అభ్యర్థులు తమ వివరాలను మార్చుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలను https://www.gate.iitb.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న
గేట్-2021 పరీక్షలో ఐఐటీ బాంబే కొన్ని మార్పులు చేసింది. కొత్త పేపర్లను
చేర్చింది.. అర్హతల్లో మార్పులు చేసింది. ఇంకా ఇలాంటి అనేక ఆసక్తికరమైన మార్పులతో
గేట్-2021 ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులు ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను
అభ్యసించటానికి ప్రధానంగా ఉద్దేశించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్
ఇంజినీరింగ్ (గేట్) ఇప్పుడు ఆర్ట్స్, కామర్స్
విద్యార్థులనూ తన పరిధిలోకి తెచ్చుకుంది.
0 Komentar