Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Google Meet: The New Feature For Online Classes

 


Google Meet: The New Feature For Online Classes

గూగుల్ మీట్: ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సరికొత్త ఫీచర్‌.. త్వరలో అందరికీ అందుబాటులోకి..!

గూగుల్‌ మీట్‌ ఆన్‌లైన్‌ క్లాసులు, కార్పొరేట్‌ మీటింగ్స్‌కు అనువుగా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

పిల్లలకు రోజూ బడి బాదరబందీ ఏమిటన్న బెంగ లేదు.. గురువుల ఆగ్రహ నయనాలు తమవైపే తీక్షణంగా చూస్తాయన్న భయం లేదు. అడిగిన ప్రశ్నకు బదులీయకపోతే వీపు పగలవచ్చునన్న బెరుకు లేదు. సెలవులు ఎప్పుడెప్పుడా అన్న చింత లేదు. కరోనా వైరస్‌ మహమ్మారి పుణ్యమా అని కనీవినీ ఎరుగని రీతిలో బడులన్నీ తలుపులు మూసుకున్నాయి. 

పిల్లలంతా వేసవికాలం, వర్షాకాలం తేడా లేకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. క్లాసులు, మీటింగ్‌లు, పరీక్షలు అంతా ఆన్‌లైన్లో‌నే.. అందుకే ఎక్కడ చూసినా ఆన్‌లైన్‌ బోధన అనే మాట వినబడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నో రకాల ఆన్‌లైన్‌ టెక్నాలజీలు, యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ముఖ్యంగా జూమ్‌, గూగుల్‌ మీట్‌ ప్రతి ఒక్కరి నోట మెదులుతున్నాయి. 

బ్రేక్‌ అవుట్‌ రూమ్స్:

ఈ క్రమంలో గూగుల్‌ మీట్‌ ఆన్‌లైన్‌ క్లాసులకు అనువుగా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దానిపేరే బ్రేక్‌ అవుట్‌ రూమ్స్‌ (breakout rooms). ఇందులో ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పేవారు విద్యార్థులను గ్రూపులుగా విభజించవచ్చు. అయితే.. మొదట గూగుల్‌ కొంత మందిని గ్రూపులుగా విభజిస్తుంది. అనంతరతం ఆన్‌లైన్‌ క్లాస్‌ నిర్వహకులు తమకు నచ్చిన వారిని ఆ గ్రూపుల్లో యాడ్‌ చేసుకోవచ్చు. 

దీనివల్ల టీచర్స్‌.. ఎక్కువ మంది విద్యార్థులతో సులభంగా కమ్యూనికేట్‌ కొవొచ్చు.. సులభంగా ప్రాజెక్ట్‌ వర్క్స్‌, హోంవర్క్స్‌ లాంటివి చేయించవచ్చు. అలాగా ఒకే కాల్‌లో పాల్గొనే విద్యార్థులను 100 గ్రూపులుగా విభజించే మరో సౌకర్యం కలదు. అయితే ప్రస్తుతం ఈ సౌకర్యం జీ సూట్‌ ఎంటర్‌ప్రైజ్‌ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. 

మరిన్ని ఆప్షన్లు:

అతి త్వరలో ఈ ఫీచర్‌కు సంబంధించి మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. టైమర్‌, ఆస్క్‌ ఫర్‌ ది హెల్స్‌ వంటి అదనపు ఆప్షన్లను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే గూగుల్‌ మీట్‌ యాప్‌లో డిజిటల్‌ వైట్‌ బోర్డ్‌, అటెండెన్స్‌ షీట్‌, క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్, పోలింగ్‌ వంచి ఫీచర్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‌

Previous
Next Post »
0 Komentar

Google Tags