Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Health Benefits of Adding Colocasia (Taro Root-Chema Dumpa) to Your Diet


Health Benefits of Adding Colocasia (Taro Root) to Your Diet
చేమ దుంపలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు  

చేమ దుంపలు ఆహారానికి టేస్ట్ ను యాడ్ చేయడంతో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా అందిస్తాయి. దీనిలో న్యూట్రిషనల్ వేల్యూ ఎక్కువ. కానీ, చేమ దుంపకు న్యూట్రిషన్ వేల్యూ పరంగా తగినంత ప్రాచుర్యం లభించలేదని చెప్పుకోవాలి. చేమ దుంప కాస్తంత నట్టీ ఫ్లేవర్ తో కొంత స్వీట్ టేస్ట్ తో మీ టేస్ట్ బడ్స్ ను సంతృప్తిపరుస్తుంది. దీన్ని సాధారణంగా రెగ్యులర్ కర్రీలా ప్రిపేర్ చేసుకుంటారు. కానీ, దీంతో స్వీట్ రెసిపీస్ కూడా ట్రై చేయవచ్చు. ఇది స్టార్చీ రూట్ వెజిటబుల్. దీని ఆకులు వెడల్పుగా ఏనుగు చెవుల షేప్ లో ఉంటాయి కాబట్టి దీనికి "ఎలిఫెంట్ ఇయర్స్" అన్న పేరు కూడా ఉంది.

ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఇది మధుమేహం రిస్క్ ను తగ్గిస్తుంది. డైటరీ ఫైబర్ డైజేషన్ ప్రాసెస్ ను స్లో చేస్తుంది. దాంతో, శరీరం ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేయగలుగుతుంది. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. కాబట్టి గ్లైసెమిక్ నియంత్రణ సాధ్యమవుతుంది.

చేమదుంపలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, మ్యాంగనీజ్ అలాగే కాపర్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ హెల్త్ ను సంరక్షించడానికి సపోర్ట్ చేస్తాయి. అలాగే, ఇందులో కార్బ్స్ తో పాటు డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇవన్నీ, ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సపోర్ట్ చేస్తాయి. చేమదుంపలను డైట్ లో యాడ్ చేయడం ద్వారా పొందగలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. బ్లడ్ సర్కులేషన్: 
చేమదుంపలో కాపర్ తో పాటు ఐరన్ లభిస్తుంది. ఇవి బ్లడ్ బిల్డింగ్ కు తోడ్పడే మినరల్స్. అనీమియాతో పాటు ఇతర రక్తసంబంధమైన సమస్యలతో బాధపడేవారికి చేమదుంప బాగా హెల్ప్ చేస్తుంది. బ్లడ్ సర్క్యూలేషన్ కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. మీ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటే మీ శరీరానికి హెల్తీ రెడ్ బ్లడ్ సెల్స్ తయారీకి తగినంత కాపర్ అలాగే ఐరన్ కంటెంట్ లభించదు. దాంతో, తలనొప్పి, నిస్సత్తువ, అలాగే ఏకాగ్రత సమస్యలు వస్తాయి. చేమదుంపను డైట్ లో భాగంగా చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను మేనేజ్ చేసే అవకాశం ఉంటుందని నిపుణులంటున్నారు. 

2. స్కిన్ హెల్త్: 
చేమదుంపల్లో విటమిన్ ఏ తో పాటు విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది. ఈ రెండు స్కిన్ డేమేజ్ ను కలిగించే వివిధ ఏజెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కొలాజెన్ ను బ్రేక్ చేసే ఫ్రీ రాడికల్స్ ను సమూలంగా నిర్మూలిస్తాయి. కొలాజెన్ అనేది స్కిన్ హెల్త్ కు తోడ్పడే ప్రోటీన్. దాంతో, స్కిన్ మంచి కండిషన్ లో ఉంటుంది. స్కిన్ హెల్త్ ను ఇంప్రూవ్ చేసునేందుకు విటమిన్ ఈ మరియు విటమిన్ ఏలు సెల్యులార్ లెవెల్స్ లో పనిచేస్తాయి. అందువల్ల, ముడుతలు, ర్యాషెస్, గాయాలు వంటివి త్వరగా నయమైపోతాయి. అలాగే, స్కిన్ సెన్సిటివిటీను కూడా తగ్గిస్తాయి. కాబట్టి, మీ స్కిన్ లోపల నుంచి ఫ్రెష్ గా అలాగే హెల్తీగా ఉండాలంటే తప్పకుండా చేమదుంపను మీరు మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. 

3. డైజెస్టివ్ హెల్త్: 
చేమదుంపల్లో డైజెస్టివ్ అలాగే నాన్ డైజెస్టివ్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. ఇవన్నీ ప్రోపర్ న్యూట్రిషన్ ను అందించేందుకు డైజెస్టివ్ హెల్త్ కు సపోర్ట్ అందించేందుకు సహకరిస్తాయి. ఇందులో డైటరీ ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇన్సోల్యుబుల్ ఫైబర్ బవుల్ మూవ్మెంట్స్ ను క్రమబద్ధీకరిస్తుంది. ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్ వాటర్ లో కరిగిపోయి జెల్ వంటి పదార్థంలా మారుతుంది. ఇది ఆహారానికి వెయిట్ ను యాడ్ చేస్తుంది. స్లోగా జీర్ణమవుతుంది. దాంతో, చీటికీ మాటికీ ఆకలి వేయదు.

4. మధుమేహం: 
ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఇది మధుమేహం రిస్క్ ను తగ్గిస్తుంది. డైటరీ ఫైబర్ డైజేషన్ ప్రాసెస్ ను స్లో చేస్తుంది. దాంతో, శరీరం ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేయగలుగుతుంది. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. కాబట్టి గ్లైసెమిక్ నియంత్రణ సాధ్యమవుతుంది. చేమదుంప గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే కావడంతో ఇది డయాబెటిక్స్ కు మంచి ఆప్షన్. జెనెరల్ గా డయాబెటిక్స్ కు ఫైబర్ రిచ్ డైట్ ను రికమెండ్ చేస్తారు. ఆ విధంగా కూడా చేమదుంప డయాబెటిక్స్ కు సిఫార్సు చేయదగినదే. చేమదుంప హెల్తీ కార్బోహైడ్రేట్. ఇది శరీరానికి తగినంత ఎనర్జీ అందిస్తుంది. కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ లో అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉండదు.


5. హార్ట్ హెల్త్: 
చేమదుంపలో పొటాషియం తగినంత మోతాదులో లభిస్తుంది. ఈ ముఖ్యమైన మినరల్ శరీరంలోని సెల్ ఫంక్షన్స్ నార్మల్ గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. శరీరంలోని సోడియం నెగటివ్ ఎఫెక్ట్స్ ను తగ్గించేందుకు పొటాషియం హెల్ప్ చేస్తుంది. బ్లడ్ వెజిల్స్ ను అలాగే ఆర్టెరీస్ ను రిలాక్స్ చేసి తద్వారా బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. కాబట్టి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ పై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. దాంతో, హార్ట్ హెల్త్ తో పాటు ఫంక్షనింగ్ మెరుగవుతుంది.

6. యాంటీక్యాన్సర్ ప్రాపర్టీస్: 
క్యాన్సర్ నిరోధానికి హెల్తీ డైట్ అనేది ఎంతో ముఖ్యం. క్యాన్సర్ తో సతమతమవుతున్నవారు గానీ లేదా క్యాన్సర్ రిస్క్ ఉన్నవారు గానీ యాంటీ ఆక్సిడెంట్స్ ను తీసుకోవడం ద్వారా బెనిఫిట్ పొందవచ్చు. ఇవి సెల్యులార్ డేమేజ్ ను ప్రివెంట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. చేమదుంపలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, చేమదుంప యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ను ప్రదర్శిస్తుంది.

7. ఇమ్యూనిటీ: 
చేమదుంపలో ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్ట్ చేసే లక్షణాలు అనేకం ఉన్నాయి. ఇందులో ఉన్న న్యూట్రియెంట్స్ శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలోని నేచురల్ డిఫెన్స్ సిస్టమ్ ను పటిష్టపరుస్తుంది. దాంతో, సాధారణ సమస్యలైన జలుబు, దగ్గు, అలాగే కామన్ ఫ్లూ నుంచి రక్షణ లభిస్తుంది.

8. కంటి ఆరోగ్యం: 
చేమదుంపలో విటమిన్ ఏకు లోటేమీ లేదు. కాబట్టి, ఇది కంటి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చెయడంలో కూడా మెయిన్ రోల్ పోషిస్తుంది. ఈ పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ మ్యాకులర్ డిజెనెరేషన్ ను తగ్గిస్తుంది. అలాగే, పొడిబారిన కళ్ళను ల్యూబ్రికేట్ చేసేందుకు కూడా విటమిన్ ఏ హెల్ప్ చేస్తుంది. సో, ఐ హెల్త్ ను సంరక్షించుకోవాలనుకునే వారు అలాగే ఇంప్రూవ్ చేసుకోవాలనుకునేవారు చేమదుంపను డైట్ లో భాగం చేసుకోవాలి.

9. ఎముకలను దృఢపరుస్తుంది: 
మెగ్నీషియం, ఐరన్ మరియు కేల్షియం వంటివి ఎముకలను హెల్తీగా ఉంచుతాయి. ఇవన్నీ చామగడ్డలో పుష్కలంగా లభిస్తాయి. చేమగడ్డలోని కేల్షియం ఫ్రాక్చర్ రిస్క్ ను తగ్గిస్తుంది. మీ దంతాలను హెల్తీ గా అలాగే ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది. ఓరల్ హెల్త్ ను కాపాడుతుంది. 

ఇవన్నీ చేమదుంపను డైట్ లో యాడ్ చేయడం ద్వారా కలిగే హెల్త్ బెనిఫిట్స్. ఎమేజింగ్ గా ఉన్నాయి కదూ.

Previous
Next Post »
0 Komentar

Google Tags