High Blood Pressure: Studies Show Adding
This Drink to Your Diet Will Lower BP
ఈ పానీయాన్ని మీ డైట్‌లో చేర్చుకోవడం
వల్ల బిపి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి
యాపిల్ సైడర్ వెనిగర్ కి చాలా
హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో హైబీపీ ని మానేజ్ చేయడం కూడా ఒకటి. అది ఎలాగో
ఇక్కడ తెలుసుకోండి..
చాలా మందికి ఉండే కామన్ హెల్త్
ప్రాబ్లమ్స్‌లో హైబీపీ కూడా ఒకటి. ఈ ప్రాబ్లం కి ప్రత్యేకమైన లక్షణాలు లేకపోవడం తో
డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ లేట్ అయిపోతాయి. ఏదైనా ఇంకొక హెల్త్
ప్రాబ్లం ఉండి డాక్టర్ దగ్గరకి వెళ్ళి అక్కడ బీపీ చూస్తే తప్ప ఈ ప్రాబ్లం గురించి
తెలియదు. కానీ, దాని వల్ల జరిగే నష్టం జరిగిపోతూనే ఉంటుంది.
హార్ట్ ప్రాబ్లమ్స్‌తో పాటూ ఇతరత్రా అనేక హెల్త్ ప్రాబ్లమ్స్‌కి హైబీపీ
కారణమౌతుంది. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు.
పద్ధెనిమిదేళ్ళు దాటిన తరువాత
రెండేళ్ళకి ఒకసారీ, నలభై దాటిన తరువాత ఏడాదికి ఒకసారీ బీపీ
చెక్ చేయించుకోవడం మంచిదని నిపుణుల సలహా. హైబీపీ ఉన్న వారు మందులతో పాటూ కొన్ని
లైఫ్ స్టైల్ ఛేంజెస్ కూడా చేసుకోవాలి. ఆహారం విషయం లో కూడా కొన్ని జాగ్రత్తలు
పాటించాలి. వాటిలో డైట్ లో యాపిల్ సైడర్ వెనిగర్ చేర్చుకోవడం కూడా ఒకటి.
యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగాలు:
1. యాపిల్ సైడర్ వెనిగర్
బాడీలో అనవసరమైన ఫ్లూయిడ్ లేకుండా చేస్తుంది. ఫ్లూయిడ్ ఎక్కువైనప్పుడు బీపీ పెరుగుతుంది.
అందుకనే, ఇది వాడడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
2. యాపిల్ సైడర్ వెనిగర్
బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. డయాబెటీస్, బీపీ
రెండూ కూడా కిడ్నీస్ ని ఎఫెక్ట్ చెస్తాయి. పైగా డయాబెటీస్ వల్ల బీపీ వచ్చే ఛాన్స్
పెరుగుతుంది. అందువల్ల డయాబెటీస్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం అవసరం.
3. యాపిల్ సైడర్ వెనిగర్
అధిక బరువు ని తగ్గిస్తుంది. ఇది మెటబాలిజం ని బూస్ట్ చేసి కొవ్వు కరిగేలా
చేస్తుంది. అపెటైట్ ని కంట్రోల్ చేసి అతిగా తినకుండా చూస్తుంది.
4. యాపిల్ సైడర్ వెనిగర్
కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వారికి
హైబీపీ వచ్చే రిస్క్ కూడా ఎక్కువే. యాపిల్ సైడర్ వెనిగర్ టోటల్ కొలెస్ట్రాల్ నీ,
ట్రైగ్లిసరైడ్స్ నీ తగ్గిస్తుంది.
5. యాపిల్ సైడర్ వెనిగర్ లో
పొటాషియం, మెగ్నీషియం వంటి ఎసెన్షియల్ మినరల్స్ ఉన్నాయి.
హైబీపీ రావడానికి కల కారణాల్లో పొటాషియం, మెగ్నీషియం
లెవెల్స్ తక్కువగా ఉండడం కూడా ఒకటి. పొటాషియం తగ్గితే బ్లడ్ లో సోడియం పెరుగుతుంది,
తద్వారా బీపీ పెరుగుతుంది. మెగ్నీషియం బ్లడ్ వెసెల్స్ ని రిలాక్స్
చేసి బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ ని డైట్ లో
ఎలా చేర్చుకోవాలి?
రోజుకి రెండు మూడు టేబుల్ స్పూన్ల
వరకూ యాపిల్ సైడర్ వెనిగర్ ని తీసుకోవచ్చు. దీన్ని రోజు మొత్తం మీద కొద్ది
కొద్దిగా తీసుకోవచ్చు. మీకు అసలు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం అలవాటు లేకపోతే
రోజుకి ఒక టీ స్పూన్ తో మొదలు పెట్టి స్లోగా రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకూ
వెళ్ళండి. దీనిని ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
1. ఒక టేబుల్ స్పూన్ రా,
అన్ ఫిల్టర్డ్ యాపిల్ సైడర్ వెనిగర్ ని ఒక గ్లాసు లో వేయండి.
2. మంచి నీరు తో కానీ,
ఫ్రూట్ జ్యూస్ తో కానీ మీ ఇష్టప్రకారం దానిని డైల్యూట్ చేయండి.
3. ప్రతి మెయిన్ మీల్ ముందూ
ఇలా తీసుకోండి. దీని వల్ల ఫుడ్ త్వరగా అరుగుతుంది, ఆకలి కంట్రోల్
లో ఉంటుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ ని
ఇంకెలాగైనా కూడా తీసుకోవచ్చా?
1. వేయించిన పాప్ కార్న్ కి
కలుపుకోవచ్చు.
2. వండిన మీట్ మీద కానీ,
వెజిటబుల్స్ మీద కానీ చల్లుకోవచ్చు.
3. స్మూతీలో యాడ్
చేసుకోవచ్చు.
4. ఆలివ్ ఆయిల్ తో కలిపి
సలాడ్ డ్రెస్సింగ్ గా వాడుకోవచ్చు.
అయితే, ఇందుకోసం
ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ నే వాడండి. అలాగే, యాపిల్
సైడర్ వెనిగర్ ని ఎక్కువ తీసుకుంటే అది పంటి మీద ఎనామిల్ కి మంచిది కాదని
గమనించండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల
ప్రకారం ఈ వివరాలను అందించాం.
0 Komentar