Honey, Mushrooms in Mid Day Meal
కేంద్రం కీలక నిర్ణయం.. మధ్యాహ్న
భోజనంలో తేనె, పుట్టగొడుగులు.!
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం మెనూలో రెండు
పోషకమైన ఆహార పదార్ధాలను చేర్చనుంది.
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం మెనూలో రెండు పోషకమైన ఆహార పదార్ధాలను చేర్చనుంది. ఇక నుంచి పిల్లలకు తేనె, పుట్టగొడుగులు అందించాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. గత 12 ఏళ్లుగా దేశంలో తేనె, పుట్టగొడుగుల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని.. వీటిని పిల్లలకు అందించడం ద్వారా వారికి మానసికంగా, శారీరికంగా సరైన ఎదుగుదల ఉంటుందని వ్యవసాయ శాఖ సూచనలు ఇచ్చింది.
అలాగే ఈ రెండు ఆహార పదార్ధాలను మధ్యాహ్న భోజన పధకం(ఎండీఎం), ఇంటిగ్రేటడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్(ఐసీడీఎస్)లో చేర్చి రైతులకు సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి కైలాష్ చౌదరి.. ఇటీవల కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను కోరారు. దీనితో మధ్యాహ్న భోజనం మెనూలో తేనె, పుట్టగొడుగులను చేర్చాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్రం ఇచ్చిన సూచనతో ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం ఆ రెండింటిని మధ్యాహ్న భోజనంలో చేర్చింది. అంతేకాదు దీని కోసం 15 శాతం అదనపు నిధులను కావాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. కాగా, దేశవ్యాప్తంగా 11.59 కోట్ల మందికి మధ్యాహ్న భోజనం అందుతోంది.
0 Komentar