IAF 88th Anniversary - Rafale Fighter
Jets Highlight
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. 88
ఏళ్ల గ‘ఘన’ చరిత్ర!
భారత గగన తలాన్ని అనునిత్యం కంటికి
రెప్పలా కాపలా కాస్తూ.. శత్రు కదలికలను నిశితంగా గమనించే భారత వైమానిక దళం 88వ
ఆవిర్భావ వేడుకలు ఈ రోజు అక్టోబర్ 8 న జరుగుతున్నాయి.
గగనతలంపై డేగ కన్నుతో నిఘా
వేస్తూ.. దేశాన్ని కాపాడటంలో వైమానిక దళానిది కీలక పాత్ర. యుద్ధ సమయాల్లో
శత్రువుపై మెరుపు దాడి చేయడంలో, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను
రక్షించడంలో వైమానిక దళం సేవలు వెలకట్టలేనివి. త్రివిధ దళాల్లో భాగమైన ఎయిర్
ఫోర్స్‌ను 1932, అక్టోబర్ 8న బ్రిటిష్
పాలన కాలంలో ఏర్పాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మన వైమానిక దళం
సాహసోపేతంగా పోరాడింది. మొదట్లో దీన్ని రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌గా పిలిచేవారు.
1950లో భారతావని గణతంత్ర దేశంగా ఆవిర్భవించాక.. ఇండియన్
ఎయిర్‌ఫోర్స్‌గా మారింది.
పాకిస్థాన్‌తో మూడు యుద్ధాలు, చైనాతో 1969 యుద్ధంలో ఎయిర్‌ఫోర్స్ పాల్గొంది. ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘ్‌దూత్, ఆపరేషన్ కాక్టస్, ఆపరేషన్ పూమలై లాంటి ఆపరేషన్లలో ఎయిర్‌ఫోర్స్ కీలకంగా వ్యవహరించింది. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 88 వార్షికోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది.
ఈ సంవత్సరం ఒక ముఖ్యమైన హైలైట్
కొత్తగా ప్రవేశపెట్టిన రాఫెల్ యుద్ధ విమానం ప్రదర్శించబడుతుంది. డిల్లీకి సమీపంలో
ఉన్న హిండన్ వద్ద ఉన్న వైమానిక దళం స్టేషన్‌లో కార్యక్రమం జరిగింది.
భారత వైమానిక దళం (ఐఎఎఫ్) ధైర్య
యోధులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. "వైమానిక దళ దినోత్సవం
సందర్భంగా భారత వైమానిక దళం యొక్క ధైర్య యోధులందరికీ చాలా అభినందనలు. మీరు
దేశంలోని ఆకాశాలను సురక్షితంగా ఉంచడమే కాకుండా, విపత్తు సమయాల్లో మానవత్వ
సేవలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. మీ ధైర్యం, శౌర్యం మరియు
అంకితభావం మా భారతిని రక్షించడానికి అందరికీ స్ఫూర్తినిస్తుంది ”అని ప్రధాని మోదీ
హిందీలో ట్వీట్ చేశారు.
0 Komentar