IBPS PO 2020: Application
Window For 3517 Vacancies to Reopen On Oct 28
ఐబీపీఎస్ బ్యాంక్ ఉద్యోగాలు.. 3517 పీవో జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్..
IBPS PO/MT- X Recruitment 2020: 3517 ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది.
బ్యాంక్ జాబ్స్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న యువతకు ఐబీపీఎస్ శుభవార్త చెప్పింది. తాజాగా ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే 1167 పోస్టులతో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP)-X నోటిఫికేషన్ విడుదలై.. నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ నోటిఫికేషన్‌కు అనుబంధంగా కొత్త
నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా 3517 ప్రొబెషనరీ ఆఫీసర్,
మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేయనుంది దరఖాస్తు ప్రక్రియ
అక్టోబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 11 దరఖాస్తుకు చివరి తేదీ. 2020 నవంబర్ 11 నాటికి విద్యార్హతలు సాధించినవారు, 2020 ఆగస్ట్ 5 నాటికి రిజిస్టర్ చేసుకోలేనివారు దరఖాస్తు చేసుకోవచ్చని ఐబీపీఎస్
ప్రకటించింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకుని.. విద్యార్హతలు, ఇతర అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి 26 వరకు దరఖాస్తు చేసినవాళ్లు, అక్టోబర్ 3, 10, 11 తేదీల్లో జరిగిన IBPS PO Prelims 2020 పరీక్షకు హాజరైనా వాళ్లు మళ్లీ అప్లయ్ చేయాల్సిన అవసరం లేదు.
మొత్తం ఖాళీలు- 3517
కెనరా బ్యాంక్- 2100
యుకో బ్యాంక్- 350
బ్యాంక్ ఆఫ్ ఇండియా- 734
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 250
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్- 83
ముఖ్య సమాచారం:
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై
ఉండాలి.
వయస్సు: 20
నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ
అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు
వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 28, 2020
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 11, 2020
ప్రిలిమినరీ ఎగ్జామ్: 2021 జనవరి 5 లేదా 6
కాల్ లెటర్ విడుదల: పరీక్షకు 10
రోజుల ముందు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175.
అధికారిక ప్రకటన:
NOTIFICATION
FOR CRP PO/MTs-X (Vacancies Updated)
Supplementary
for CRP PO/MTs-X
దరఖాస్తు విధానం:
ముందుగా https://www.ibps.in/
వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో CRP PO/MT నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో నోటిఫికేషన్, ఆన్‌లైన్
అప్లికేషన్ లింక్స్ ఉంటాయి.
ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్
చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో Click here for
New Registration పైన క్లిక్ చేయాలి.
మీ పేరు, ఇతర
వివరాలన్నీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఫోటో, సంతకం
అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసే ముందు
వివరాలన్నీ చెక్ చేసుకోవాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసి ఫీజు
చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
దరఖాస్తు కాపీని ప్రింట్ తీసుకోవాలి.
0 Komentar