ICAI Enables Provisional Registration in
Foundation Course after Passing ‘Class X’ Exams
టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..
సీఏ ఫౌండేషన్ కోర్సుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు..!
సీఏ కోర్సుకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న నిబంధనను సవరిస్తూ ఐసీఏఐ తాజాగా నిర్ణయం తీసుకుంది.
టెన్త్ విద్యార్థులకు ఐసీఏఐ గుడ్‌న్యూస్ చెప్పింది. సీఏ కోర్సుకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న నిబంధనను సవరిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఎంసెట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్.. రాష్ట్ర, జాతీయ పరీక్షలు ఏవైనా సరే.. ఇంటర్ సెకండియర్ చదువుతూనే దరఖాస్తు చేసుకొని సదరు పరీక్షలకు హాజరుకావొచ్చు.
కానీ.. సీఏ ఫౌండేషన్ పరీక్షలు రాయాలంటే మాత్రం ఇంటర్మీడియట్ పూర్తి కావాల్సిందే. తాజాగా ఈ నిబంధనను మారుస్తూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పదో తరగతి పూర్తయిన వెంటనే సీఏలో మొదటి దశగా భావించే ఫౌండేషన్ కోర్సు పరీక్షలు రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ.. పరీక్ష మాత్రం ఇంటర్ పూర్తయిన తర్వాతే రాయాల్సి ఉంటుంది.
సీఏ పరీక్షలు వాయిదా:
దేశవ్యాప్తంగా నవంబరు 1వ
తేదీ నుంచి జరగాల్సిన సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షలను నవంబరు 21 నుంచి డిసెంబరు 14వ తేదీ మధ్య నిర్వహించనున్నారు.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల డిమాండ్ మేరకు ఐసీఏఐ ఈ నిర్ణయం
తీసుకున్నట్లు తెలుస్తోంది.
0 Komentar