Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

If You Have These Symptoms, You May Have A Vitamin-D Deficiency


If You Have These Symptoms, You May Have A Vitamin-D Deficiency
ఈ లక్షణాలు ఉంటే విటమిన్ డి లోపం ఉన్నట్లేనట..

విటమిన్ డి బాడీకి ఎంతో అవసరం.. ఈ విటమిన్ లేకపోవడం వల్ల బాడీలో కొన్ని సమస్యలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే విటమిన్ డి సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోండి. 

కరోనా ప్రతి ఒక్కరి జీవితాలని అతలాకుతలం చేస్తోంది. దీనికి వ్యాక్సిన్, మందు కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. దీనికి విరుగుడుగా మనం విటమిన్ డీ పని చేస్తోందని చెబుతున్నారు. ఈ వైరస్ బారిన పడకుండా మనల్ని కాపాడి,మన ఎముకలూ, పళ్ళూ, కండరాలూ బలంగా ఉండడానికి సాయపడుతుంది. మన తిన్న ఆహారం నుంచి కాల్షియం, ఫాస్ఫేట్ మన బాడీ అబ్జార్బ్ చేసుకునేలా చేస్తుంది. ఈ విటమిన్ మన శరీరంలో సూర్యరశ్మితోనే లభిస్తుంది. సూర్యరశ్మి మనందరికీ ఉచితంగానే లభిస్తున్నా ప్రపంచంలో కనీసం ఒక బిలియన్ జనాభా విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో మనకి కావల్సినంత విటమిన్ డీ కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. 

1. డిప్రెషన్..

మీకు బాగా మూడ్ స్వింగ్స్ ఉండి, ప్రత్యేకమైన కారణం లేకుండా ఆలోచిస్తుంటే అది విటమిన్ డీ లోపించడం వల్ల కూడా వస్తుంది.. సూర్యకాంతి మన మూడ్ బాగుండేలా చేస్తుంది. మన బ్రెయిన్‌లో సెరటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గితే మనం మూడ్ స్వింగ్స్‌ని ఎక్స్‌పీరియెన్స్ చేస్తాం. సూర్యరశ్మి సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారికి కూడా సూర్యకాంతి హెల్ప్ చేస్తుంది. 

2. బరువు పెరగడం

విటమిన్ డి మన ఎముకలు, పళ్ళనీ బలంగా ఉంచటమే కాకుండా, మన బాడీకి నైట్రిక్ ఆక్సైడ్ ని అందిస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ మన మెటబాలిజంని బూస్ట్ చేసి అనవసరమైన ఆహారం తినకుండా చూస్తుంది. కాబట్టి బరువు పెరగడం కూడా విటమిన్ డీ లోపాన్ని సూచిస్తుంది. 

3. జుట్టు ఊడడం

హెయిర్ ఫాల్‌కి చాలా కారణాలుండొచ్చు కానీ, ఎక్కువగా విటమిన్ డీ లోపం వల్లే అలా జరుగుతుంది. ఈ విటమిన్ జుట్టు కుదుళ్ళని స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. సో, బాడీ కి ఈ విటమిన్ అందకపోతే హెయిర్‌ఫాల్ మొదలవుతుంది. ఇంకా, జుట్టు కి సంబంధించిన చాలా సమస్యలకి కూడా విటమిన్ డీ లోపమే ప్రధాన కారణం. 

4. గాయం త్వరగా తగ్గకపోవడం.

విటమిన్ డీ వల్ల గాయం మీద కొత్త చర్మం త్వరగా ఏర్పడుతుంది. ఈ విటమిన్ వాపు తగ్గించడమే కాక ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడుతుంది. అందుకని గాయం త్వరగా మానకపోతే విటమిన్ డీ సరిపోవటం లేదో చూసుకోవాలి. 

5. జాయింట్ పెయిన్స్

బోన్స్ హెల్దీగా, స్ట్రాంగ్‌గా ఉండాలంటే కాల్షియం అవసరం. కానీ, శరీరంలో విటమిన్ డీ ఉంటేనే ఆహారం నుంచి కాల్షియం శరీరానికి అందుతుంది. ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా పెద్దవాళ్ళకి వస్తుంది. అందులోనూ చలికాలంలో వాళ్ళు చలికి భయపడి బయటికి రాకపోవడంతో చాలినంత విటమిన్ డీ వారి దగ్గర ఉండదు. 

6. నిద్ర లేమి

రాత్రి సరిగ్గా నిద్ర పట్టడం లేదంటే అర్ధం మీరు సహజ కాంతిలో ఎక్కువగా ఉండడం లేదని. మనం ప్రస్తుతం ఎక్కువగా ఇంట్లోనే ట్యూబ్‌లైట్స్ కింద ఉంటున్నాం. అది మన నిద్రని చెడగొడుతుంది. ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఇంటి బయట గడపండి. 

విటమిన్ డీకి బెస్ట్ సోర్స్ సూర్యకాంతి. కానీ, అది కుదరదు అనుకున్నప్పుడు డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ తీసుకోండి. పాలకూర, బెండకాయ, సోయా, చేపలలో కూడా కొద్ది మొత్తం లో ఈ విటమిన్ ఉంటుంది. వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

Previous
Next Post »
0 Komentar

Google Tags